Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కడుపు నిండాలంటే కోరిక తీర్చాల్సిందే: సహాయక సిబ్బంది దారుణాలు!

గాజాలో యుద్ధం కారణంగా ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గాజలో తీవ్రమైన మానవతా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయ మహిళలపై కొందరు పాలస్తీనా పురుషులు లైంగిక దోపిడీకి పాల్పడుతున్నట్లు సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్ (AP)కు ఆరుగురు స్థానిక మహిళలు తమ భయంకరమైన అనుభవాలను వెల్లడించారు. ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిలో ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సహాయక సంస్థ అయిన UNRWAకు చెందిన వాలంటీర్లు కూడా కూడా ఉండటం గమనార్హం.

సహాయం, ఉద్యోగం ఆశ చూపి లైంగిక దోపిడీ
ప్రస్తుతం గాజాలో నెలకొన్న దయనీయ పరిస్థితులను కొందరు పురుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సహాయ వనరులను ఆయుధంగా వాడుకుంటూ మహిళలు అంగీకరించని లైంగిక చర్యలకు వారిని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. ఈ మహిళలు ప్రతీకార భయంతో తమ పేర్లను గోప్యంగా ఉంచాలని కోరారు. తమ కోరికను తీరిస్తేనే సాయం, ఆహారం అందిస్తామని చెప్పి మహిళలను లోబర్చుకుంటున్నారు. మానవతా సాయం ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

Sexual Exploitation in Gaza UNRWA Aid Workers Accused of Demanding Sex for Food and Jobs

వితంతువుకు వేధింపులు: 35 ఏళ్ల వితంతువు UNRWA ద్వారా సాయం పొందుతున్నప్పుడు ఓ ఉద్యోగికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. మొదట్లో మామూలుగా ఉన్న సంభాషణ.. రాత్రిపూట కాల్స్‌తో మొదలై, ఆమె లోదుస్తుల రంగు, లైంగిక జీవితం వంటి అసభ్యకరమైన వ్యక్తిగత ప్రశ్నలతో కొనసాగింది. అతను తనను లైంగిక చర్యకు రావాలని కోరగా ఆమె నిరాకరించింది. ఫలితంగా, ఆ తర్వాత ఆమెకు ఎటువంటి మానవతా సహాయం అందలేదు.

ఉద్యోగం పేరుతో ఉచ్చు: మరొక 38 ఏళ్ల మహిళకు ఒక వ్యక్తి సహాయక సంస్థలో ఆరు నెలల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, ఆహారం అందిస్తానని హామీ ఇచ్చాడు. UN గుర్తు ఉన్న వాహనంలో ఆమెను ఆఫీసుకు తీసుకెళ్లకుండా, నిర్మానుష్యంగా ఉన్న ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. ఆమె హిజాబ్ తీయమని ఆదేశించి, లైంగిక సంబంధం పెట్టుకుంటేనే బయటకు వెళ్లనిస్తానని బెదిరించాడు. భయంతో ఆమె అంగీకరించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు డిసెంబర్‌లో UNRWAలో ఆరు నెలల కాంట్రాక్ట్ లభించింది. మొదటి లైంగిక చర్య జరిగిన కొద్ది వారాలకే ఆ ఉద్యోగి ఆమెకు రూ.100, ఆహారం, మందుల పెట్టెను కూడా ఇచ్చాడు.

UNRWA విధానాలపై ప్రశ్నలు.. లోపాలు
బాధితురాలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టడానికి UNRWA అధికారులు ఆ సంభాషణ రికార్డింగ్‌ను ఆధారంగా కోరినట్లు మహిళ తెలిపింది. ఈ డిమాండ్ తమ సంస్థ విధానాలకు విరుద్ధమని UNRWA కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియట్ టౌమా స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల పట్ల తమకు జీరో టాలరెన్స్ పాలసీ ఉందని, ఆధారాలు అవసరం లేదని తెలిపారు. సంస్థ విధానాలు ఒకలా ఉంటే, క్షేత్ర స్థాయిలో వాటి అమలులో లోపాలు ఉన్నట్లు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది.

తనను పెళ్లి చేసుకోమని బెదిరింపులు
నలుగురు పిల్లలున్న 37 ఏళ్ల తల్లిని ఒక షెల్టర్ అధిపతి ఆహారం, వసతి ఇస్తానని చెప్పి లైంగిక వేధింపులకు గురిచేశాడు. మరో తల్లికి తన పిల్లలకు పోషకాహార సప్లిమెంట్లు ఇవ్వడానికి బదులుగా తనను పెళ్లి చేసుకోమని ఒక సహాయక కార్యకర్త అభ్యర్థించాడు. ఆమె నిరాకరించి బ్లాక్ చేయగా, అతను వేరే నంబర్ల నుంచి కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడసాగాడు.

మానసిక వైద్యుల ఆందోళన
నలుగురు స్థానిక మానసిక వైద్యులు (Psychologists) మాట్లాడుతూ.. డజన్ల కొద్దీ మహిళలు తమకు లైంగిక దోపిడీ గురించి చెప్పారని, ఈ దుర్వినియోగం కారణంగా కొందరు గర్భవతులు అయినట్లు కూడా వెల్లడించారు. UNRWA సభ్యునిగా ఉన్న గ్లోబల్ ప్రొటెక్షన్ క్లస్టర్ (GPC) జూన్ 2024లో విడుదల చేసిన నివేదికలో కూడా గాజాలోని సహాయక కార్యకర్తలు దుర్బల వర్గాలపై హింస, దోపిడీ, అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం వంటి లైంగిక దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్‌లో మహిళా హక్కుల విభాగం అసోసియేట్ డైరెక్టర్ హెదర్ బార్ ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. మానవతా సంక్షోభాలు లైంగిక హింసను పెంచుతాయని, గాజాలోని పరిస్థితి ముఖ్యంగా మహిళలు, బాలికలకు మాటల్లో చెప్పలేనిది అని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+