బొమ్మను పెళ్ళాడిన మహిళ; మరో బుజ్జిబొమ్మ సంతానంగా.. ఈ స్టోరీ చదివితే షాకవ్వటం పక్కా!!

పిచ్చి పలురకాలు అంటారు. అలాగే ప్రేమ కూడా గుడ్డిది అని తరచూ చెబుతుంటారు. ఇక ఆ మాటలను నిజం చేస్తూ బ్రెజిల్‌లోని ఓ మహిళ చేసిన పని అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఆమె గుడ్డి ప్రేమ ఒ బొమ్మను ప్రేమించి పెళ్ళాడేలా చేసింది. అంతేకాదు ఓ బుజ్జిబొమ్మకు అమ్మను కూడా చేసింది.

తల్లి ఇచ్చిన రాగ డాల్ తో ప్రేమలో పడిన బ్రెజిల్ మహిళ

తల్లి ఇచ్చిన రాగ డాల్ తో ప్రేమలో పడిన బ్రెజిల్ మహిళ

బ్రెజిల్ దేశానికి చెందిన 37 సంవత్సరాల మోరేస్ అనే మహిళ ఇటీవల ఒక బొమ్మను పెళ్లి చేసుకుంది. గతంలో ఆమెకు ఆమె తల్లి ఓ రాగ్ డాల్ బహుమతిగా ఇచ్చింది. ఆమె తల్లి ఆమెకు మొదటిసారిగా బహుమతి ఇచ్చిన బొమ్మ మార్సెలోతో ప్రేమలో పడింది. మోరేస్‌కు డ్యాన్స్ భాగస్వామి లేకపోవడంతో ఆమె ఆ బొమ్మను తయారు చేసి కుమార్తె మోరేస్ కు ఇచ్చింది.

250 మంది అతిధుల సమక్షంలో ఘనంగా వివాహం.. ఆపై హనీమూన్..

250 మంది అతిధుల సమక్షంలో ఘనంగా వివాహం.. ఆపై హనీమూన్..

కానీ, మార్సెలో మోరేస్ జీవితంలోకి వచ్చిన తర్వాత, బొమ్మను ఆమె డ్యాన్స్ భాగస్వామిగా కాకుండా, మరింత సన్నిహితంగా భావిస్తూ ప్రేమలో పడింది మోరేస్. అంతే కాదు ఇటీవల 250 మంది అతిథుల సమక్షంలో తన ప్రియుడు మార్సెలోను వివాహం చేసుకుంది. టాకింగ్ క్యాట్ మార్సెలోతో తన వైవాహిక జీవితం అద్భుతంగా ఉందని తాను సంతోషంగా ఉన్నానని చెప్పిన మోరేస్ రియోడిజెనీరో నగరానికి భర్తను తీసుకొని హనీమూన్ కోసం వెళ్ళింది. అంతేకాదు తన భర్తతో తనకు ఉన్న ప్రేమకు చిహ్నంగా మరో బుజ్జి బొమ్మను సంతానంగా స్వీకరించింది మోరేస్.

తన భర్త తనను అర్ధం చేసుకుంటాడని చెప్తున్న మహిళ.. బుజ్జి బొమ్మను బిడ్డగా..

తన భర్త తనను అర్ధం చేసుకుంటాడని చెప్తున్న మహిళ.. బుజ్జి బొమ్మను బిడ్డగా..

మోరేస్, బొమ్మగా ఉన్న తన భర్తను ఉద్దేశించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన భర్త తనతో వాదించ లేదని గొడవ పడలేదని, ఎప్పటికీ తనను అర్థం చేసుకుంటాడని ఆమె చెబుతోంది. "మార్సెలో గొప్ప భర్త అని ఆమె పేర్కొంది. మహిళలందరూ అతన్ని అసూయ పడతారని మోరేస్ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మే 21న బేబీ డాల్‌ను స్వాగతించిన మోరేస్ లైవ్ స్ట్రీమ్ ద్వారా దాదాపు 200 మంది వ్యక్తులతో బొమ్మ పుట్టిన విషయాన్నిపంచుకున్నారు.

 జనాలు హేళన చేస్తే కోపం వస్తుందన్న మహిళ.. వెర్రి వెయ్యి రకాలంటున్న జనాలు

జనాలు హేళన చేస్తే కోపం వస్తుందన్న మహిళ.. వెర్రి వెయ్యి రకాలంటున్న జనాలు

అయినప్పటికీ, ప్రజలు తన బొమ్మ భర్త మరియు తన బిడ్డతో తన జీవితాన్ని హేళన చేసినప్పుడు తాను కలత చెందానని వెల్లడించింది. ఎవరైనా తన భర్తను బొమ్మ అంటే తనకు చాలా కోపం వస్తుందని, రాగా డాల్ గా ఉన్న మార్సెలో తన కుటుంబ సభ్యుడిని ఆమె చెబుతుంది. ఇక మోరేస్ పిచ్చి ప్రేమను గురించి తెలిసిన వారంతా వెర్రి వెయ్యి రకాలని విస్మయానికి గురవుతున్నారు. బొమ్మతో ప్రేమలో పడటం, బొమ్మని పెళ్లాడటం, ఆ బొమ్మకు మళ్లీ బుజ్జి బొమ్మను బిడ్డగా కనడం ఎక్కడైనా ఉంటుందా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+