స్కూల్‌లోనే నగ్నంగా విద్యార్థినిపై టీచర్ రేప్ యత్నం(వీడియో)
బీజింగ్: చైనాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు పట్టపగలే పాఠశాలలోనే అత్యాచారానికి ప్రయత్నించాడు. బట్టలన్నీ ఊడదీసుకుని ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యారు
చైనాలోని లింగ్షాన్ కౌంటీలోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనను ధృవీకరించింది. నిందిత ఉపాధ్యాయుడు 2011లో మతిస్థిమితం సరిగా లేకపోవడం చికిత్స తీసుకున్నాడని, పూర్తిగా కోలుకోవడంతో తిరిగి విధుల్లో చేరాడని తెలిపింది.
గత ఐదేళ్లుగా పాఠశాలలో తరగతులు చెప్పిందేకు అతడ్ని అనుమతించలేదని, అయినా అతడు విధులు నిర్వహిస్తున్నాడని తెలిపింది. అయితే, మార్చి 8న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడని పేర్కొంది. బట్టల్నీ ఊడదీసుకుని నగ్నంగానే ఆ యువతిపై హూ అనే ఈ ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి యత్నించాడు.
వెంటనే అప్రమత్తమైన ఇతర ఉపాధ్యాయులు.. ఆ యువతిని అతడి బారి నుంచి రక్షించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. కాగా, నిందితుడి దాడిలో సదరు యువతికి ఎలాంటి గాయాలు కాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.












Click it and Unblock the Notifications