Viral Video: ముంచుకొచ్చిన హిమపాతం.. వైరల్ అయిన వీడియో..
ప్రకృతిలో తీసిన కొన్ని వీడియోలు ఎంత అందంగా ఉంటాయో .. ఒక్కోసారి అంతే భయానకంగా ఉంటాయి. ఓ ప్రదేశంలో ముంచుకొస్తున్న మంచును చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారింది. కిర్గిజ్‌స్థాన్‌లోని తియాన్ షాన్ పర్వతాలలో చిత్రీకరించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో మంచుతో కూడిన హిమపాతం ఒక రాతి లోయను చీల్చివేసి, పాదాల వైపు దూసుకుపోతున్నట్లు చూపిస్తుంది. ఒక హైకర్ ద్వారా క్యాప్చర్ చేసిన అసాధారణమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోకు 14.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని చూసి ప్రజలు ఉలిక్కిపడ్డారు. అపురూప దృశ్యాన్ని కెమెరాలో బంధించిన వ్యక్తి క్షేమంగా ఉన్నాడో లేదో తెలియరాలేదు.
I suppose there was nowhere to run to, but still! 😳pic.twitter.com/3GE4M4YOxa
— James Withers (@scotfoodjames) July 10, 2022












Click it and Unblock the Notifications