చిక్కిపోతున్న చంద్రుడు

వాషింగ్టన్ : చందమామ చిక్కిపోతున్నాడట. ఈ మాట ఎవరో ఆషామాషీగా చెబుతున్నది కాదు.. అంతరిక్ష పరిశోధన సంస్థ ఏళ్ల తరబడి పరిశోధించి చెప్పిన వాస్తవం. చంద్రుడిలో అంతర్గతంగా ఉన్న చల్లదనం, ఇతర కారణాల వల్ల జాబిల్లి క్రమంగా కుచించుకు పోతున్నాడని నాసా స్పష్టం చేసింది.

చంద్రుడు ఎండు ద్రాక్షలాగా మారి కుచించుకుపోయినట్లు నాసా అధ్యయనంలో తేలింది. ఈ పరిణామం ఈ మధ్య మొదలైంది కాదని, కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల నుంచి కొనసాగుతోందని తేలింది. ఇప్పటి వరకు చంద్రుడు దాదాపు 150 అడుగుల కన్నా ఎక్కువ కుచించుకుపోయినట్లు నాసా అధ్యయనం స్పష్టం చేస్తోంది. దీని కారణంగానే చంద్రుని ఉపరితలం ముడుచుకుపోవడం, ప్రకంపనలు చోటు చేసుకోవడం తదితర పరిణామాలు సంభవిస్తాయని అంతరిక్ష పరిశోధన సంస్థ అంచనా వేసింది.

Shrinking Moon May Be Generating Moonquakes

చంద్రునికి సంబంధించి లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటార్ తీసిన 12 వేలకుపైగా ఫొటోలను విశ్లేషించిన సైంటిస్టులు ఈ విషయాన్ని నిర్థారించారు. ద్రాక్ష పండుపై ఉన్న చర్మంలాగే చంద్రుని ఉపరితలం ఉంటుందని శాస్త్రవేత్తలు.. చందమామ కుచించుకుపోతే ఈ ఉపరితలంపై పగుళ్లు ఏర్పడతాయని అంటున్నారు. భూమిలాగ చంద్రుని అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్లు లేవు. అయితే 4.5 బిలియన్ ఏళ్ల క్రితం చంద్రుడు ఏర్పాడిన నాటి నుంచి దాని లోపల ఉన్న వేడిని నెమ్మదిగా కోల్పోయి టెక్టోనిక్ ప్రక్రియ ప్రారంభమైందని, తద్వారా జాబిల్లి ముడుచుకుపోతోందని సైంటిస్టులు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+