రోడ్డు ప్రమాదం: 6గురు భారతీయులు మృతి
న్యూయార్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులు మృతి చెందారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు. గతవారం ఓక్లహామాలోని మేయెస్ కౌంటీలో 69వ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
భారతదేశానికి చెందిన భాస్కర్‌ఝా, అతడి భార్య అన్నుఝా, 1, 3 ఏళ్ల వయసున్న వీరి ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. బీహార్‌లోని మధుబాని జిల్లాకు చెందిన భాస్కర్ ఏడాదిగా అమెరికాలో కాగ్నిజంట్ సంస్థలో పనిచేస్తున్నారు.

ఘటన జరిగినప్పుడు వర్షం పడుతుందని, భాస్కర్ మినీ వ్యానును డ్రైవ్ చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. భాస్కర్ అతి వేగంగా నడపడం వల్ల అదుపుకోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టారని తెలిపారు. ఐదో మృతుడ్ని అగ్నిపాల్ సింగ్‌గా గుర్తించినట్లు తెలిపిన పోలీసులు.. ఆరో మృతురాలి గురించిన వివరాలు తెలియలేదని చెప్పారు.
ఈ ప్రమాదంలో ఆరో మృతురాలి సంతానంగా భావిస్తున్న 8నెలల చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆస్పత్రలో చికిత్స పొందుతోంది. కాగా, ప్రమాదం జరిగి ఐదు రోజులైనప్పటికీ భాస్కర్ కుటుంబసభ్యుల మృతదేహాలు భారతదేశానికి రాలేదని న్యూఢిల్లీలోని భాస్కర్ సోదరుడు ప్రేమ్ శంకర్ ఝా తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల శాఖను ఈ విషయంపై విన్నవిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications