వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిట్ట కొంచెం.. కూత ఘనం: ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన ఆరేళ్ళ చిన్నారి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన జరిపిన లక్షలాది మందిలో ఆరేళ్ళ సోఫీ క్రూజ్ అనే చిన్నారి అందరి దృష్టినీ ఆకర్షించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా లక్షలాది మంది మహిళలు వాషింగ్టన్ వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

పాప్ సింగర్ మడోన్నా వంటి ప్రముఖులతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అయితే.. అంతమందిలో కూడా ఆరేళ్ళ సోఫీ క్రూజ్ అనే చిన్నారి అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ చిన్నారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తూటాల్లా అక్కడున్న వారి హృదయాలను తాకింది. "మన కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రేమతో అందరం దగ్గరయ్యాం.." అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే చూడండి.

Six-year-old girl gives inspiring speech at Women’s March

"మన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కలిసికట్టుగా ధైర్యంతో, ప్రేమగా పోరాడదాం. నేను పిల్లలందరికీ ఒకటే చెప్పదలచుకున్నా. మీరు ధైర్యంగా ఉండండి.."

"మనం ఒంటరిగా లేము. గుండెలనిండా ప్రేమను నింపుకున్న చాలా మంది ప్రజలు మనతో ఉన్నారు. అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడదాం. దేవుడు మనతోనే ఉన్నాడు.." అంటూ ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది సోఫీ క్రూజ్.

తరువాత స్పానిష్ లోనూ ప్రసంగించి ఈ చిన్నారి అందరి హృదయాలు కొల్లగొట్టింది. మెక్సికో కు చెందిన సోఫీ గతేడాది శరణార్థుల తరపున గళమెత్తి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకునే అవకాశాన్ని దక్కించుకోవడమే కాక... శరణార్థులు తరపున పోరాడిన వారికి ఇచ్చే 'డిఫైన్ అమెరికన్' అవార్డును సైతం అందుకుంది.

English summary
A six-year-old girl, whose parents are undocumented immigrants, gave an inspiring speech at the Women’s March in Washington. Speaking in English and Spanish, Sophie Cruz, asked the thousands of protestors to “protect our families”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X