27, 28 తేదీల్లో స్నాప్‌డీల్ భారీ ఆఫర్ సేల్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఈ నెల 27, 28 తేదీల్లో బిగ్ ఎలక్ట్రానిక్ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 70 శాతం దాకా డిస్కౌంటుతో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మనున్నట్లు స్నాప్ డీల్ వెల్లడించింది.
ప్రత్యేక ఆఫర్‌లతో పాటు అన్ని రకాల బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన తగ్గింపు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కంప్యూటర్‌లు తదితర అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది.

డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాల పైన పద్దెనిమిది వేల రూపాయల తగ్గింపు ఇవ్వనుంది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేయనుంది.
ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్ ద్వారా అమ్మకాలు భారీస్థాయిలో పెరిగే అవకాశముందని స్నాప్ డీల్ వైస్ ప్రెసిడెంట్ (ఎలక్ట్రానిక్స్, హోం) టోనీ నవిన్ తెలిపారు. ఏడు లక్షలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన తదుపరి రోజే డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications