వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షానికి వెళ్లాలనుకుంటున్నారా ? చైనా విమానంలో సీటు ధర ఇదే ? 2025 నుంచే..

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయంగా అంతరిక్ష ప్రయాణాలపై అవగాహన పెరుగుతోంది. పరిశోధనా సంస్ధలకు తోడు పర్యాటక సంస్ధలు కూడా అంతరిక్ష ప్రయాణాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. వీటిలో అమెరికాలో స్పేస్ ఎక్స్ ఇలాంటి కార్యక్రమాల్ని రూపొందిస్తుండగా.. ఇప్పుడు చైనా కూడా పోటీకి దిగుతోంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) 2025 నాటికి అంతరిక్షంలోకి పర్యాటక విమానాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రయాణీకులకు $287,200 నుండి $430,800వరకు ఒక్కో సీటుకు దాదాపు 2-3 మిలియన్ యువాన్లు వసూలు చేయాలని భావిస్తున్నారు.

ప్రయాణీకులను చిన్న చిన్న జాయ్‌రైడ్‌లలో అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి ఇచ్చే సంక్షిప్త సబార్బిటల్ విమానాలపై చైనా ప్రస్తుతం దృష్టిసారిస్తోంది. ఈ మేరకు చైనా జాతీయ అంతరిక్ష సంస్ధ సీజీటీఎన్ ఓ ప్రకటన చేసింది. సీనియర్ రాకెట్ శాస్త్రవేత్త యాంగ్ యికియాంగ్, బీజింగ్‌కు చెందిన రాకెట్ కంపెనీ CAS స్పేస్ వ్యవస్థాపకుడు CGTNతో మాట్లాడుతూ మూడు రకాల అంతరిక్ష ప్రయాణాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అంతరిక్ష పర్యాటక విమానాలు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది. ఇది భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు చెల్లించే ప్రయాణికుల్ని కార్మెన్ లైన్‌ వరకూ తీసుకెళ్లి తాకి తిరిగి వస్తుంది. కర్మన్ లైన్, భూమికి ఎగువన ఉన్న 100 కిలోమీటర్ల సరిహద్దు అంతరిక్షానికి ఆరంభంగా పరిగణిస్తున్నారు.

space travel-china to charge you $2,87,200 per seat now-here are details..

చైనా పర్యాటక విమానాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. సమీప భవిష్యత్తులో పేయింగ్ కస్టమర్‌లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే అవకాశం గురించి భారతదేశం కూడా ఆలోచిస్తోంది. జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ తమ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌లను అంతరిక్షంలోకి నడిపించడంతో స్పేస్ టూరిజం రేసు మొదలైంది. జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఈ ఏడాది మూడు విజయవంతమైన విమానాలను పంపి స్పేస్ టూరిజం రేసులో అగ్రగామిగా ఉంది. అయితే బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ తన తొలి మిషన్ తర్వాత మరో విమానాన్ని పంపలేదు. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సంస్ధయొక్క బ్లూ ఆరిజిన్ పది నిమిషాల విమానంలో పర్యాటకులను ప్రారంభించింది. మస్క్ డ్రాగన్ అంతరిక్ష నౌక నలుగురు పర్యాటకులతో కూడిన సిబ్బందిని మూడు రోజుల పాటు అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది.

English summary
china has expected to begin its space tourism flights by 2025.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X