వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును.. దివాళా తీశాం- శ్రీలంక సర్కార్ సంచలన ప్రకటన-ఐఎంఎఫ్ సాయానికి వినతి

|
Google Oneindia TeluguNews

శ్రీలంక ప్రభుత్వం ఇవాళ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే విదేశీ అప్పులు పెరిగిపోయి ఆర్ధిక సంక్షోభం బారిన పడిన శ్రీలంక దివాళా తీసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మహీంద రాజపక్స ఓ ప్రకటన చేశారు. అంతే కాదు ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న విదేశీ అప్పులు తీర్చలేక దివాళా తీసిందని ప్రధాని మహీంద ప్రకటించారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోందని, దీనివల్ల ప్రజలకు మందులు, ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరత ఏర్పడిందని వెల్లడించారు. శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య రైతులకు కీలకమైన ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిరసనలు విరమించుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సహనంగా ఉండాలని కోరారు. మరోవైపు ఆర్ధికంగా దివాళా తీసిన తమకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధికి శ్రీలంక సర్కార్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఉన్న 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు తీర్చలేమని తెలిపింది.

sri lanka announces defaulting on all its external debts, urge imf for Stimulus package

గత ఏడాది రసాయనిక ఎరువులపై నిషేధం విధించిన తర్వాత పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలకమైన ఎరువుల సబ్సిడీని మళ్లీ ప్రవేశపెడుతుందని ప్రధాని మహీందా రాజపక్సే తన ప్రసంగంలో తెలిపారు.రైతులను పూర్తిగా సేంద్రియ ఎరువుల వైపుకు మళ్లించడానికి ఇది తగిన సమయం కాదన్నారు. శ్రీలంక సాధారణంగా ఎరువుల సబ్సిడీల కోసం సుమారు 36 బిలియన్ల శ్రీలంక రూపాయలను ($114 మిలియన్లు) కేటాయిస్తోంది, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఇది 2 మిలియన్లకు పైగా రైతులకు ఉపయోగపడుతోంది. శ్రీలంక వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రీయ వ్యవసాయానికి మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని గత సంవత్సరం నిలిపివేసింది. ఇది రైతు సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, విద్యావేత్తల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

English summary
sri lanka prime minister mahinda rajapaksa on today announced that they defaulting on external debts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X