వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్!: శ్రీశ్రీ రవిశంకర్ యోగా పాఠాలకు ఐరాపా పార్లమెంట్ ఫిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

బ్రస్సెల్స్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ యోగా ప్రసంగం యూరోపియన్ పార్లమెంటును ఆకట్టుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో ఇచ్చి పిలుపు రవిశంకర్ ఆధ్యాత్మికోపన్యాసం సందర్భంగా ఐరోపాలో మంగళవారం ప్రతిధ్వనించింది.

'ది యోగా వే' పేరుతో ఇండియన్ ఎంబసీ దీనిని ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా రవిశంకర్ యోగా ప్రాశస్త్యం గురించి యూరోపియన్ పార్లమెంటులో వివరించారు. హింసలేని సమాజం, వ్యాధిరహిత దేహం, ఒత్తిడిలేని మనసు, వేదనఛాయలు లేని ఆత్మ, సకల మానవాళి శ్రేయస్సుకు యోగ అపరసంజీవిలా ఉపకరిస్తుందని ఆయన చెప్పారు.

Sri Sri Ravi Shankar's yoga session inspires European Parliament

ఆయన యోగ ప్రాశస్త్యం విన్న వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్ నేర్పిన ధ్యాన, యోగముద్రలను పార్లమెంటు సభ్యులు, అధికారులు, వివిధ దౌత్యవేత్తలు, ప్రముఖులు ఆలకించారు. దీనిని యూరోపియన్ లోని అన్ని పొలిటికల్ గ్రూప్స్ ఆస్వాదించాయి.

భగవత్ గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా గుర్తించాలి: బీజేపీ ఎంపీ

భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా గుర్తించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్ చరిత్ర నిషాద్ లోకసభలో బుధవారం ప్రతిపాదించారు. బుధవారం లోకసభ శూన్యగంటలో నిషాద్ చేసిన ప్రతిపాదనకు అన్ని వైపుల నుంచి సభ్యులు మద్దతు తెలిపారు. ఆధునిక కాలంలో మానవుల సమస్యలకు గీతలో పరిష్కారం ఉందన్నారు.

English summary
Indian Prime Minister Narendra Modi's call at the UN for an International Day of Yoga reverberated in the European Parliament, the world's largest legislative body, on Tuesday, with internationally known guru Sri Sri Ravi Shankar leading a major yoga event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X