కండరాలను కొరికి తినే బ్యాక్టీరియా విజృంభణ: 977 పాజిటివ్ కేసులు: లక్షణాలు ఇవే
Streptococcal toxic shock syndrome: సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చింది చైనా. లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది. దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైంది. అనేక దేశాలు చితికిపోయింది. లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది.
దీని పేరు- స్ట్రెప్టొకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. కండరాలను కొరికి తినడం దీని లక్షణం. ఈ కరోనా వైరస్‌ను మించిన బ్యాక్టీరియా జపాన్‌లో శరవేగంగా విస్తరిస్తోంది. ఇది సోకితే 48 గంటల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరీరియాను నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవు. తాత్కాలికంగా వైద్యమే శరణ్యం.

జపాన్‌లో ఇప్పటికే 977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 2,500కు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపింది. మరణాల రేటు 30 శాతానికి పైగా ఉంటోంది. గ్రూప్ ఏ స్ట్రెప్టొకోకల్ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుంది. గొంతు వాపు, శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది.
ఇదే జాతికి చెంది మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరును ధ్వంసం చేస్తుంది. కండరాల వాపు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, లో- బీపీ, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోకపోవడం, కాలేయ ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని టోక్యో మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ కెన్ కుకుచి తెలిపారు. ఈ బ్యాక్టీరియా సోకిన 48 గంటల్లో మనిషి మరణించే ప్రమాదం ఉందని అన్నారు.
చిన్నపిల్లలు, 50 సంవత్సరాలకు పైగా వయస్సున్న వారు దీని బారిన అధికంగా పడే అవకాశం ఉందని కుకుచి పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా విస్తరిస్తోండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ జపాన్‌ను కోరింది.












Click it and Unblock the Notifications