Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ పై తాలిబన్ల ఆక్రోశం-కమాండర్ షాకింగ్ ఆడియో-ప్రధాని మార్పు, హక్కానీలపై కీలక వ్యాఖ్యలు

ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమవుతున్న తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతునివ్వడం ఇన్నాళ్లూ చూశాం. కానీ తాలిబన్లలోనూ పాకిస్తాన్ పై గూడు కట్టుకుని ఉన్న అసంతృప్తి తాజాగా బయటపడింది. తాలిబన్లకు చెందిన ఓ కమాండర్ మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఇందులో అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ జోక్యం వల్ల అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బతింటోందంటూ సదరు కమాండర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 పాకిస్తాన్ తో తాలిబన్ల స్నేహం

పాకిస్తాన్ తో తాలిబన్ల స్నేహం

ఆప్ఘనిస్తాన్ కు పొరుగున్న ఉన్న పాకిస్తాన్ కూ, తాలిబన్లకు గట్టి సంబంధాలే ఉన్నాయి. గతంలో అల్ ఖైదాపై దాడుల పేరిట ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్ల సర్కార్ ను కుప్పకూల్చి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమెరికాపై పాకిస్తాన్, తాలిబన్లకు పీకల దాకా కోపం ఉంది. అదే సమయంలో చైనాకు దగ్గర కావడం ద్వారా అమెరికాతో సంబంధాల్ని సైతం పాకిస్తాన్ దూరం చేసుకుంది. తాజాగా ఆప్ఘనిస్తాన్ లో ప్రతిఘటన దళాలతో జరిగిన పోరులోనూ పాకిస్తాన్ సహకరించడం వల్లే తాలిబన్లు పంజ్ షీర్ లోయను స్వాధీనం చేసుకోగలిగారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటులోనూ పాకిస్తాన్ సహకరిస్తోందని అంతా భావిస్తున్నారు. కానీ అసలేం జరుగుతందో అక్కడ ఓ తాలిబన్ కమాండర్ బయటపెట్టాడు.

 తాలిబన్లకు పాక్ పై అసంతృప్తి

తాలిబన్లకు పాక్ పై అసంతృప్తి

తాలిబన్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సహకరించేందుకు పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ కొన్ని రోజులు, పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీఫ్ ఫైజ్ హమీద్ మరికొన్నిరోజులు కాబూల్లోనే పాగా వేశారు. తాలిబన్లకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పలు సూచనలు చేసి వెళ్లారు. ముఖ్యంగా ఐఎస్ఐ ఛీఫ్ పర్యటన తర్వాత తాలిబన్లలో అసంతృప్తి మొదలైంది. ఐఎస్ఐ ఛీఫ్ జోక్యం వల్లే తాలిబన్లలో విభేధాలు కనిపించాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం తాలిబన్లు అప్పటికే ఎంచుకున్న ఆప్షన్లను ఐఎస్ఐ ఛీఫ్ ఫైజ్ హమీద్ వ్యతిరేకించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లకు పాకిస్తాన్ పై అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

తాలిబన్ కమాండర్ సంచలన ఆడియో

తాలిబన్ కమాండర్ సంచలన ఆడియో

పాకిస్తాన్ పై తాలిబన్లలో అసంతృప్తి పెరుగుతోందనే వాదనకు మద్దతుగా తాజాగా ఓ ఆడియో బయటికి వచ్చింది. ఇందులో ఓ తాలిబన్ కమాండర్ పాకిస్తాన్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. పాకిస్తాన్ ఆప్ఘనిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల తమకు ఎలా నష్టం జరుగుతోందో కూడా వివరించాడు. స్ధూలంగా చెప్పాలంటే ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుతం అన్ని సమస్యలకూ పాకిస్తానే కారణం అన్నట్లుగా సదరు తాలిబన్ కమాండర్ వ్యాఖ్యానించాడు. దీంతో ఇప్పుడు ఆ ఆడియో వైరల్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ పై సదరు కమాండర్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరుగుతోంది.

పాక్ చెప్పిందనే హక్కానీలకు చోటిచ్చి...

పాక్ చెప్పిందనే హక్కానీలకు చోటిచ్చి...

పాకిస్తాన్ వల్ల అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బతింటోందంటూ సదరు తాలిబన్ కమాండర్ ఆడియోలో వ్యాఖ్యానించాడు.. మరో తాలిబన్ కమాండర్ తో మాట్లాడుతూ ఇతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తాలిబన్ల కేబినెట్ బెర్తుల విషయంలో పాకిస్తాన్ చేసిన సూచనలపైనే ఈ ఇద్దరు కమాండర్లు మాట్లాడుకున్నారు. ఇందులోనూ తాలిబన్లు పాకిస్తాన్ జోక్యం వల్ల హక్కానీ నెట్ వర్క్ కు చెందిన నలుగురు నేతల్ని కేబినెట్లోకి తీసుకునేందుకు అంగీకరించారు. దీనిపై అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఈ నలుగురు హక్కానీ నెట్ వర్క్ నేతల్ని కేబినెట్ లోకి తీసుకోవాల్సిందేనని పాకిస్తాన్ పట్టుబట్టడంతో తాలిబన్లు చేసేది లేక అంగీకరించినట్లు తెలుస్తోంది.

Recommended Video

    Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Oneindia Telugu
    ఐఎస్ఐ ఛీఫ్ ఒత్తిడితోనే బరాదర్ కు బదులు హసన్ ?

    ఐఎస్ఐ ఛీఫ్ ఒత్తిడితోనే బరాదర్ కు బదులు హసన్ ?

    తాజాగా ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీఫ్ ఫైజ్ హమీద్ చర్చలు జరిపారు. ముఖ్యంగా ఆయన పాకిస్తాన్ వ్యతిరేక వైఖరితో ఉండే ముల్లా ఘనీ బరాదర్ స్ధానంలో సుప్రీం కమాండర్ అఖుంద్ జాదా కోరుతున్న ముల్లా హసన్ కు ప్రధాని పదవి ఇప్పించేలా వారిని ఒప్పించారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఐఎస్ఐ ఛీఫ్ చెప్పిన ప్రకారం ముల్లా హసన్ కు ప్రధాని పదవి కట్టబెట్టేందుకు తాలిబన్ నేతలు అంగీకరించారు. ఐఎస్ఐ ఛీఫ్ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలు కలిగిన బరాదర్ కు అవకాశం దక్కి ఉండేది. అలా కాలేదన్న ఆక్రోశం తాలిబన్ కమాండర్ ఆడియో వ్యాఖ్యల్లో కనిపించింది. దీంతో ఇప్పుడు సదరు కమాండర్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని తాలిబన్లు బయటపెట్టినట్లయింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+