కాందహార్‌‌కు తాలిబన్ లీడర్ల మకాం: ప్లీనరీ.. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక అక్కడే

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వేళ.. దేశానికి అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందంటూ తాలిబన్ నేతలు విజయోత్సవాలు జరుపుకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తాలిబన్లు అడుగులు వేస్తోన్నారు. దీనికోసం తమ మకాం కాందహార్‌కు మార్చబోతోన్నారు. మూడు రోజులపాటు తాలిబన్ నేతలు అక్కడే వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. తాలిబన్ టాప్ క్యాడర్ నాయకులందరూ ఈ భేటీకి హాజరు కానున్నారు.

కాందహార్‌లో కీలక భేటీ..

కాందహార్‌లో కీలక భేటీ..

కాందహార్.. తాలిబన్లకు కీలక స్థావరం. ఒకరకంగా ఈ నగరాన్ని తమ పుట్టినిల్లుగా భావిస్తుంటారు తాలిబన్లు. అమెరికా సైనిక బలగాలు ఆప్ఘనిస్తాన్‌లో మోహరించిన తొలి రోజుల్లో.. తాలిబన్ల నుంచి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి సుదీర్ఘకాలం పాటు పోరాడాల్సి వచ్చింది. ఎలాంటి కీలక నిర్ణయాలు గానీ, సమావేశాలను గానీ నిర్వహించాలనుకుంటే తాలిబన్లకు మొదట గుర్తుకొచ్చేది ఈ నగరమే. అందుకే- ఇఫ్పుడు కూడా మళ్లీ అక్కడికే మకాం మార్చనున్నారు. శని, ఆది, సోమవారల్లో మూడు రోజుల పాటు భేటీ కానున్నారు.

 ప్రభుత్వ ఏర్పాటుపై..

ప్రభుత్వ ఏర్పాటుపై..

కాందహార్‌లో నిర్వహించే ఈ వరుస సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటు గురించి తాలిబన్లు చర్చిస్తారని తెలుస్తోంది. ఎలాంటి విధి విధానాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై టాప్ క్యాడర్ లీడర్ల మధ్య చర్చకు రానుంది. రెండు దశాబ్దాల కిందట పరిపాలించినట్టే మత ఛాందసవాదాన్ని, ఇస్లామిక్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలా? లేక.. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన సాగించాలా? అనే విషయంపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం.

 బరాదర్ సహా..

బరాదర్ సహా..

సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రజలకు భద్రత, సామాజికాంశాలను కేంద్రబిందువుగా చేసుకుని కాందహార్ వేదికగా మూడు రోజుల పాటు వరుస భేటీలు నిర్వహిస్తామని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తమ దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా పేరు మార్చబోతోన్నామని స్పష్టం చేశారు. తాలిబన్ల లీడర్‌షిప్ స్ట్రక్చర్‌లో కీలక నేత అబ్దుల్ ఘనీ బరాదర్ సహా పలువురు నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. షరియా చట్టంపై ఈ భేటీలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక

కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక

తాలిబన్ల సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వానికి అబ్దుల్ ఘనీ బరాదార్ సారథ్యాన్ని వహించే అవకాశాలు ఉన్నట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా బరాదర్ బాధ్యతలను స్వీకరించడం దాదాపు ఖాయమైనట్టే. కాందహార్ సమావేశాల్లోనే ఈ దిశగా ఓ నిర్ణయానికి వస్తారని, అధ్యక్షుడిగా బరాదర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని విదేశీ మీడియా అంచనా వేస్తోంది. తాలిబన్ల నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కాని, ముల్లా యాకూబ్, రాహ్బరి షురా వంటి కీలక నేతల సమక్షంలో బరాదర్ ఎంపిక జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Recommended Video

    Talibans ఆ విమానాలన్నీ తమకే అనుకున్నారు.. US Army పంచ్ | Afghanistan || Oneindia Telugu
    అల్‌ఖైదా నాయకుడికి ఆహ్వానం..

    అల్‌ఖైదా నాయకుడికి ఆహ్వానం..

    అదే సమయంలో అల్‌ఖైదా కీలక అమీరుల్ హక్.. సైతం ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలను కొట్టి పారేయట్లేదు విదేశీ మీడియా. జాడ తెలియకుండా పోయిన అమీరుల్ హక్.. కొద్దిరోజుల కిందటే ఆప్ఘనిస్తాన్‌కు చేరుకున్నాడు. అతని స్వస్థలం నంగర్‌హర్ ప్రావిన్స్. ఆయనకు ఘన స్వాగతం పలికారు తాలిబన్ ఫైటర్లు. అతనికి ఇస్తోన్న ప్రాధాన్యతను బట్టి చూస్తే.. తాలిబన్ల ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని విదేశీ మీడియా అంచనా వేస్తోంది. అదే జరిగితే- ఆప్ఘనిస్తాన్ మరోసారి అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ జోన్‌గా మారుతుందని అభిప్రాయపడుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+