వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ రూల్ : ఆఫ్ఘనిస్థాన్ మహిళలు ఉద్యోగాలు చెయ్యొద్దు, బయటకు రావద్దు, హుకుం జారీ !!

|
Google Oneindia TeluguNews

అందరూ ఊహించిందే జరిగింది. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికల హక్కులకు భంగం కలుగుతుందని ప్రపంచం అంతా అనుమానించిందే నిజమైంది. ఆఫ్ఘనిస్థాన్లో మహిళలపై నిర్బంధం కొనసాగుతోంది. ప్రస్తుత తాలిబన్ పాలనలో మహిళలు సురక్షితంగా లేరని వారి మాటల ద్వారానే అర్ధం అవుతుంది.తాలిబన్ సంస్థ ఆఫ్ఘన్ మహిళల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత దృష్ట్యా బయట ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. మహిళల ఆర్ధిక స్వాతంత్రాన్ని హరించింది.

మహిళలపై తాలిబన్ల నిర్బంధ కాండ .. మహిళలు ఇళ్లకే పరిమితం

మహిళలపై తాలిబన్ల నిర్బంధ కాండ .. మహిళలు ఇళ్లకే పరిమితం

తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలు తమ భద్రత కోసం పనికి వెళ్లరాదని సూచించారు. భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాలిబన్లు అంతర్జాతీయ సమాజంలో ఆఫ్ఘనిస్థాన్ విషయంలో వెల్లువెత్తిన ఆందోళనను తగ్గించే క్రమంలో వారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మహిళల పట్ల మరింత సహనంతో ఉంటారని తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ అన్నారు. కానీ గతంలోలానే మహిళలపై నిర్బంధకాండ కొనసాగుతుందని మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేయడంతో అర్థమవుతుంది.

తోడు లేకుండా రోడ్డు మీదకు వచ్చినా నేరమే

తోడు లేకుండా రోడ్డు మీదకు వచ్చినా నేరమే

1996 మరియు 2001 మధ్య తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళలను పని ప్రదేశాల నుండి నిషేధించింది. మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వారిని తోడు లేకుండా ఇంటి నుండి బయటకు రాకుండా చేసింది . వారి మొత్తం శరీరాలను కప్పి ఉంచేలా బుర్కా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో రోడ్డుమీదికి మహిళలు రావాలంటేనే భయపడిన పరిస్థితులున్నాయి. ఇక బాలికలు స్కూల్స్ కు వెళ్లి చదువుకునే పరిస్థితి లేకుండా చేసింది. ఇప్పుడు మళ్లీ జాబ్స్ చేయొద్దని, బాలికలు స్కూల్స్ కు వెళ్లొద్దు అని మహిళల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ నాయకుడు వెల్లడించడం, అప్పటి పరిస్థితికి అద్దం పడుతుంది.

మహిళల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన

మహిళల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన

మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతూ, ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేసింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మానవ హక్కుల ఉల్లంఘనల నివేదికలపై సంయమనం పాటించాలని, మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాలనలో పారదర్శకత పాటిస్తూ, మహిళల భద్రతకు కృషిచేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది .
అయితే తాలిబన్ ఇప్పటి ప్రభుత్వం మరింత మితంగా ఉంటుందని వాగ్దానం చేసింది. గతం కంటే భిన్నంగా ఉంటామని చెప్పిన తాలిబన్ నాయకులు మహిళల హక్కులు హరించబడవని హామీ ఇవ్వడానికి నిరాకరించారు. షరియా చట్టం అమలులో ఉంటుందని, షరియా చట్టం ప్రకారం పాలన కొనసాగుతుందని వెల్లడించారు.

ఇళ్లకే పరిమితం అయిన మహిళలు ... నో జాబ్స్

ఇళ్లకే పరిమితం అయిన మహిళలు ... నో జాబ్స్

తాలిబన్ల ఆటవిక పాలన లో చాలామంది మహిళలు ఇప్పటికే హింసను ఎదుర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ఆక్రమణలకు వెళ్ళినప్పటి నుండి మహిళా ఉద్యోగులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావద్దని , ఇళ్లలోనే ఉండాలని, భద్రతా సిబ్బంది అనుమతిస్తే బయటకు రావాలంటూ తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలకు అవకాశమే లేకుండాపోయింది. ధైర్యం చేసి ఎవరైనా ఉద్యోగం చేయాలని బయటకు వచ్చినా సదరు సంస్థలు మహిళలను ఉద్యోగం చేయడానికి అనుమతించటం లేదు. ఈ పరిస్థితులు మహిళా లోకాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి.

 కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ .. ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్లేందుకు బారులుగా పౌరులు

కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ .. ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్లేందుకు బారులుగా పౌరులు

ఇదిలా ఉంటే తాలిబన్ నాయకులు అమెరికా నుండి తరలింపు ప్రక్రియను ఆగస్టు 31 లోపు పూర్తి చేయాలని, మరియు ఇకపై ఆఫ్ఘన్‌లను తరలించడానికి అనుమతించరు అని చెప్పారు. దీంతో ఇప్పుడు యుద్ధప్రాతిపదికన తరలింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గత 24 గంటల్లో మొత్తం 19,000 మంది నిర్వాసితులు ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టినట్లు పెంటగాన్ బుధవారం ప్రకటించింది, ఇందులో 42 యుఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 11,200 మంది ప్రయాణిస్తున్నారు . మరో 7,800 మందిని సంకీర్ణ భాగస్వాములు ఖాళీ చేశారు. ఇదిలా ఉంటే తాలిబన్ ఆటవిక పాలన తట్టుకోలేక చాలా మంది ఆఫ్ఘనిస్థాన్ వాసులు దేశాన్ని వదిలి వెళ్లాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద పరిస్థితి ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనకు సాక్ష్యం

కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద పరిస్థితి ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనకు సాక్ష్యం

కాబూల్ విమానాశ్రయంలో యూఎస్ తరలింపు ఆపరేషన్ ఇటీవలి రోజుల్లో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ నుండి ఇతర దేశాలకు పారిపోవడానికి పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ వాసులు క్యూ కడుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ వాసులు అనుమానం వ్యక్తం చేసినట్లుగా ఆఫ్ఘనిస్థాన్లో 20 ఏళ్ల క్రితం సాగిన ఆటవిక పాలన మరోమారు పునరావృతమైంది. మహిళలను సెక్స్ బానిసలుగా తయారు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మహిళలు బయటకు రావద్దని నిర్బంధకాండ కూడా కొనసాగుతుంది.

Recommended Video

Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan
అప్పటి పాలనే మళ్ళీ రిపీట్ .. తాలిబన్ల ఆటవిక పాలన

అప్పటి పాలనే మళ్ళీ రిపీట్ .. తాలిబన్ల ఆటవిక పాలన

మొదటి శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు గతంలో పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలను కు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. మహిళలను ఇళ్లకే పరిమితం చేశారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు. ఇప్పుడు కూడా నరకాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.

English summary
Detention of women continues in Afghanistan. It is clear from their words that women are not safe under the current Taliban regime. The Taliban organization has made a sensational decision in the case of Afghan women. It ordered that women not be required to do outside jobs for safety reasons and should be confined to their homes. Drained the financial independence of women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X