గ్యాంగ్ రేప్ చేసి, మహిళను రోడ్డుపై పడేసి పోయారు

రాత్రంతా మహిళపై వేధింపులకు పాల్పడి, ఆమెను శాంతిరాం కాలేజీ వద్ద రోడ్డుపై పడేసి పోయారు. ఉదయాన్ని పొలం పనులకు వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనం ద్వారా ఆమెను నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉందని అంటున్ారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి స్వస్థలం ఖమ్మం జిల్లా అని పోలీసులు తెలిపారు. ఈ దారుణం స్థానికంగా కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications