వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 35 పదాలు పలకగానే అగ్రరాజ్యానికి అధ్యక్షుడైపోయినట్లే!

'ఒక్క అడుగు.. ఒక్క అడుగు..' అనే డైలాగ్ 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ ను నాయకుణ్ణి చేస్తుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 'ఒక్క అడుగు.. ఒక్క అడుగు..' అనే డైలాగ్ 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ ను నాయకుణ్ణి చేస్తుంది. అదే రియల్ పాలిటిక్స్ లో మాత్రం ఒక్క అడుగు కాదుగాని, '35 పదాలు' పలికిన వ్యక్తి అగ్రరాజ్యం అమెరికాకి అధ్యక్షుడు అయిపోతారు.

అవును.. మరికొద్ది గంటల్లో అగ్రరాజ్యాధి నేతగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్.. రెండు బైబిళ్ళపై చేతులు ఉంచి చేయబోయే ప్రమాణంలో కేవలం 35 పదాలు ఉంటాయి. ఈ రెండు బైబిళ్ళలో ఒకటి ట్రంప్ కు ఆయన తల్లి బహుకరించినది కాగా, మరొకటి 150 ఏళ్ల క్రితం అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేసింది.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అంటే.. భారత కాల మాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ మెట్లపై ఈ 35 పదాలను పలకడంతో ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసినట్లు అవుతుంది.

The 35 Most Important Words Of Inauguration Day

అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. ట్రంప్ చేత ప్రమాణం చేయిస్తారు. 2008లో బరాక్ ఒబామాతో ప్రమాణం చేయించింది కూడా ఈయనే. 'ఇనాగరేషన్'గా అభివర్ణించే ప్రమాణ స్వీకారోత్సవం.. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ట్రంప్, మైక్ పెన్స్ లు సతీసమేతంగా లింకన్ మెమోరియల్ ను సందర్శించడంతో ప్రారంభమైంది.

క్యాపిటల్ భవనంలో ప్రమాణస్వీకారం, అక్కడి నుంచి 'అమెరికా ప్రధాన రహదారి'గా పిలిచే పెన్సిల్వేనియా అవెన్యూ గుండా దాదాపు 2.4 కిలోమీటర్ల మేర వైట్ హౌస్ వరకు ఊరేగింపు ఉంటుంది. రాత్రి అధికారిక విందుతో ఈ వేడుక ముగుస్తుంది.

English summary
The 35 words in Article II, Section I, of the Constitution read as follows: "I do solemnly swear that I will faithfully execute the office of President of the United States and will to the best of my ability, preserve, protect and defend the Constitution of the United States."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X