Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని అరెస్ట్ చెయ్యాలన్న తజికిస్తాన్‌లోని ఆఫ్ఘన్ ఎంబసీ .. రీజన్ ఇదే !!

తజికిస్తాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని అరెస్ట్ చెయ్యాలని పోలీసులను కోరింది. ఆఫ్ఘన్ జాతీయ భద్రతా సలహాదారు హమ్దుల్లా మోహిబ్ మరియు ఘనీ మాజీ ప్రధాన సలహాదారు ఫజెల్ మహమూద్‌ను అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్ పోలీసులను డిమాండ్ చేసింది. అష్రఫ్ ఘనీ, హమ్దుల్లా మోహిబ్ మరియు ఫజెల్ మహమూద్ ఫాజ్లీ ఖజానా దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ సంపద చోరీ చేశారని ఆయనను అరెస్ట్ చెయ్యాలని కోరినట్టు సమాచారం.

Recommended Video

    Former Afghan President Ashraf Ghani Fled With Cars, Chopper Full Of Cash, Claims Russia

    ఆఫ్ఘన్ ప్రజల సంపదను తిరిగి అప్పగించాలన్న తాలిబన్లు

    ఆఫ్ఘన్ ప్రజల సంపదను తిరిగి అప్పగించాలన్న తాలిబన్లు


    ఆఫ్ఘనిస్థాన్ ప్రజల సంపదను పునరుద్ధరించడానికి అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కు ట్రెజరీని అప్పగించాలని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం అష్రఫ్ ఘనీని డిమాండ్ చేసింది. ఆయన ఎక్కడ ఉన్నా అరెస్ట్ చెయ్యాలని తాలిబన్ సర్కార్ డిమాండ్ చేసింది. ఇక ఈ విషయాన్ని స్థానిక మీడియా బుధవారం నివేదించింది. తాలిబన్లు కాబూల్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న కారణంగా యుద్ధంలో చిక్కుకున్న దేశం నుండి పారిపోయిన అష్రఫ్ ఘనీ, తజికిస్తాన్ తన భూభాగంలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో ఒమన్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది.

    అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్ ప్రజల నగదుతో పారిపోయారని రష్యా రాయబార కార్యాలయం వెల్లడి

    అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్ ప్రజల నగదుతో పారిపోయారని రష్యా రాయబార కార్యాలయం వెల్లడి


    ఘనీ పొరుగున ఉన్న తజికిస్తాన్ లేదా ఉజ్బెకిస్థాన్‌కు పారిపోయి ఉండవచ్చునని అనేక మీడియా నివేదికలు సూచించిన క్రమంలో, ప్రస్తుతం అతని ఆచూకీ ఇది అని చెప్పడానికి కచ్చితంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఇక ఇదే సమయంలో కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం అష్రఫ్ ఘనీ నాలుగు కార్ల నిండా, ఒక హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయారని అది సరిపోకపోవడంతో కొంత డబ్బును వదిలిపెట్టాల్సి వచ్చిందని పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని రష్యా వెల్లడించిన విషయాన్ని రాయిటర్స్ నివేదించిన విషయం తెలిసిందే.

     రక్తపాతాన్ని నివారించటానికి పారిపోయానని పోస్ట్ చేసిన అష్రఫ్ ఘనీ

    రక్తపాతాన్ని నివారించటానికి పారిపోయానని పోస్ట్ చేసిన అష్రఫ్ ఘనీ

    అష్రఫ్ ఘని సంక్షోభ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది. స్వీయ రక్షణ చేసుకున్న ఆయన, తాలిబన్ల నుండి రక్తపాతాన్ని నివారించడానికి తాను దేశం విడిచి వెళ్లిపోయానని ఘనీ చెప్పుకున్నాడు. ఆదివారం ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో, అష్రఫ్ ఘనీ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించాలనుకున్న సాయుధ తాలిబన్ల వల్ల భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని , గత 20 ఏళ్లు తాను జీవించిన దేశాన్ని కాపాడటానికి నేను నా జీవితాన్ని అంకితం చేసిన ప్రియమైన దేశాన్ని విడిచిపెట్టాను అని చెప్పాడు. అయితే తాలిబన్లకు భయపడి దేశాన్ని వదిలి పోయిన అష్రఫ్ ఘనిని దేశ ద్రోహి గా ఆఫ్ఘనిస్తాన్ వాసులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

    రెండు మార్లు అధ్యక్షుడిగా పని చేసిన అష్రఫ్ ఘనీ

    రెండు మార్లు అధ్యక్షుడిగా పని చేసిన అష్రఫ్ ఘనీ


    విద్యావేత్త మరియు ఆర్థికవేత్త అయిన అష్రఫ్ ఘని ఆఫ్ఘనిస్తాన్ 14 వ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను మొదట సెప్టెంబర్ 20, 2014 న ఎన్నికయ్యారు . ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2019 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. తాలిబాన్లు 1996 నుండి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించారు. కానీ సెప్టెంబర్ 11, 2001 అమెరికాపై దాడుల తరువాత, మిలిటెంట్ గ్రూపు యొక్క క్రూరమైన పాలన 2001 లో అమెరికా నేతృత్వంలోని దళాలచే అధికారం నుండి తొలగించబడింది. అప్పటినుండి తాలిబన్లకు యూఎస్ దళాలకు మధ్య నిత్య పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇటీవల అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకోవడంతో ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+