వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధుడి మృతదేహంతో పోస్టాఫీసుకు వచ్చారు.. పెన్షన్ ఇవ్వమని అడిగారు.. ఆ తర్వాత..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఐర్లండ్ పోస్టాఫీస్

ఒక వృద్ధుడి మృతదేహాన్ని పోస్టాఫీసుకి తీసుకెళ్లి అతడి పెన్షన్ తీసుకోవటానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించటం కలకలం రేపింది.

ఐర్లండ్‌లోని కార్లో పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చనిపోయిన పెన్షనర్‌ను ఇద్దరు వ్యక్తులు జాగ్రత్తగా పడిపోకుండా పట్టుకుని తెచ్చారని, పోస్టాఫీసులోకి వచ్చి అతడి పెన్షన్ ఇవ్వాలని కోరారని ఐరిష్ టైమ్స్ ఒక కథనంలో చెప్పింది.

'అలా పట్టుకుని తెచ్చారు, అతడి ఆరోగ్యం బాగానే ఉందా?’ అని సిబ్బంది ప్రశ్నలు సంధించటంతో గుర్తు తెలియని ఆ ఇద్దరు వ్యక్తులు.. వృద్ధుడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారని తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. వృద్ధుడికి ఏమయ్యిందోనని పరిశీలించిన సిబ్బంది.. అతడు చనిపోయినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి లోనయ్యారు.

''ఓ వృద్ధుడి మరణానికి దారితీసిన పరిస్థితులపై గార్డాయ్ (ఐర్లండ్ పోలీసు విభాగం) దర్యాప్తు చేస్తోంది’’ అని ఆ కథనంలో వివరించింది.

ఈ సంఘటన గురించి వ్యాఖ్యానించటానికి గార్డా అధికార ప్రతినిధి నిరాకరించారు. అయితే ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు.

ఈ కేసు దర్యాప్తులో ''గార్డా టెక్నికల్ బ్యూరో, ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ పాథాలజిస్ట్ సేవలను కోరాం. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. ఆ ఫలితాలను బట్టి దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.

శుక్రవారం ఈ ఘటన జరగటానికి ముందు.. అదే పోస్టాఫీసుకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఒక వృద్ధుడి తరఫున పెన్షన్ తీసుకోవటానికి వస్తానని చెప్పినట్లు ఐర్లండ్ రేడియో ఆర్‌టీఈ తన వార్తల్లో తెలిపింది.

అయితే.. పెన్షన్ డబ్బులు విడుదల చేయాలంటే సదరు పెన్షనర్ తప్పనిసరిగా ఉండాలని చెప్తూ ఆ వినతిని సిబ్బంది తిరస్కరించారు.

ఆ తర్వాత కొంత సేపటికి.. ఇద్దరు వ్యక్తులు 60 ఏళ్ల వయసున్న ఓ పురుషుడిని తీసుకు వచ్చారు. అతడు పోస్టాఫీసులో ''కుప్పకూలిపోయాడు’’.

''ఆ వృద్ధుడిని పోస్టాఫీసుకు తీసుకువచ్చేటప్పటికే చనిపోయాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ఆర్‌టీఈ వివరించింది.

పోస్టాఫీసుకు సమీపంలోని ఒక ఇంటిని నేర స్థలంగా గుర్తించినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
They came to the post office with the body of an old man,asked for a pension, what happend
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X