షాకింగ్: కుటుంబమంతా రేప్, బాయ్ ఫ్రెండ్ కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓ మహిళ పైన తండ్రి, సోదరుడు, బాయ్ ఫ్రెండ్, బంధువులు.. ఇలా ఎంతోమంది అత్యాచారం చేశారు. ఆ మహిళ విషాద గాథ అందరినీ కంట తడి పెట్టించేదిలా ఉంది. ఆమె వయస్సు ఇప్పుడు 42. చిన్నతనం నుంచి ఎన్నో దారుణాలను ఆమె చవి చూసింది.

చిన్న వయస్సులోనే తండ్రి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. సోదరుడు కూడా తన మృగత్వాన్ని చాటుకున్నాడు. ఆ సమయంలో ఆమెది ఏం తెలియని వయస్సు. సొంత ఇంట్లో కూడా ఆమెకు రక్షణ లేకుండా పోయింది. ఓ బంధువు కూడా ఆమె పట్ల అనుచితంగానే ప్రవర్తించాడు.

This woman was allegedly raped family and relatives

సొంత ఇంట్లో రక్షణ లేకపోవడంతో బయటకు వచ్చింది. చివరకు బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె పైన అఘాయిత్యం చేశాడు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి ఆదుకుంటానని చెప్పి నమ్మించాడు. కానీ అతను కూడా ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు.

తొమ్మిదేళ్ల వయస్సులో సోదరుడు, ఆ తర్వాత 25 ఏళ్ల వయస్సులో ఆదుకుంటానని చెప్పిన వ్యక్తి ఆమె పైన దారుణానికి ఒడిగట్టారు. ఆ బాధితురాలి వయస్సు ఇప్పుడు 42 ఏళ్లు. తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆమె పేరు యాన్ యంగ్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This woman was allegedly raped by her father, brother, boyfriend and relative, and her life story is earth-shatteringly shocking.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి