జనావాసాల్లోకి దూసుకెళ్లిన విమానం: ముగ్గురు మృతి
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలోని శివారు ప్రాంతంలో ఓ చిన్న విమానం జనావాసాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానం కూలిపోగా అక్కడి ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మయన్మార్‌లో రన్‌వేపై జారిన విమానం
మయన్మార్ విమానం యాంగూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా పక్కకు జారింది. శుక్రవారం సాయంత్ర జరిగిన ఈ ఘటనలో ఒక బౌద్ధ సన్యాసి తలకు స్వల్ప గాయాలయ్యాయి.

మాన్డలే నుంచి వచ్చిన ఎయిర్‌బాంగ్ ఏటీఆర్ 72 విమానం భారీవర్షాల కారణంగా విమానాశ్రయంలో దిగుతుండగా పక్కకు జారిందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 49 మంది ప్రయాణికులు సురక్షింతంగా ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications