'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని ముద్రించనందుకు 960 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కెనడా కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. సుమారు 17 సంవత్సరాల పాటు కోర్టులో వాదోపవాదాలు సాగిన తర్వాత మూడు పొగాకు కంపెనీలకు గాను $15 బిలియన్లు (రూ.960 కోట్లు)లను వినియోగదారులకు చెల్లించాలని సోమవారం తీర్పునిచ్చింది.
సిగరెట్లకు బానిసలమై ఆరోగ్యాలను చెడుగొట్టుకున్నామని, అందుకు సిగరెట్లు తయారు చేసిన కంపెనీలదే బాధ్యత అని ఆరోపిస్తూ, 1998లో కొంత మంది కెనడాలోని కుబెక్ ప్రావిన్స్ సుపీరియర్ కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసుని విచారించిన కోర్టు ఇంపీరియల్ టొబాకో, బెన్సన్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్ డొనాల్డో టొబాకో తదితర కంపెనీలు తప్పు చేశాయని తీర్పు వెల్లడించింది. బాధితులకు $15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 960 కోట్లు) పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

నిజానికి కెనడాలో పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి నిషేధాలు లేవు. 'పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం' అన్న నినాదం సిగరెట్ పెట్టెపై ఉండాలని, అలాంటి హెచ్చరికలు జారీ చేయనందున బాధితుల ఆరోగ్యాగనికి కంపెనీలదే బాధ్యత అని న్యాయమూర్తి, నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు.
ఈ తీర్పుపై సిగరెట్ కంపనీలు పై కోర్టుకు అపీల్ చేయనున్నట్లు ప్రకటించారు. 1950 నుంచి కూడా కెనడియన్లు పొగ త్రాగే విషయంలో సరైన అవగాహనను కలిగి ఉన్నారని తెలిపారు. ఇంపీరియల్ టొబాకా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ తీర్పు తమను ఎంతో నిరాశకు గురి చేసిందని అన్నారు.












Click it and Unblock the Notifications