ఘోర రైలు ప్రమాదం, 37 మంది మృతి, 137 మందికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో 37 మంది మరణించారు. మరో 137మందికిపైగా గాయపడ్డారు.

ఈజిప్టు ఉత్తర తీరంలోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకొందని అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలిసన వెంటనే అధికారులు సహయకచర్యలను చేపట్టారు.

Train collision in Egypt leaves dozens dead

రెండు రైళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొందని అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్లే రాజధాని కైరో నుండి వస్తున్న రైలు ఆగి ఉంటే, మరో రైలు వచ్చి ఢీకొట్టిందని అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంఘలన స్థలం భయానక వాతావరణం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two trains collided in Alexandria on Friday, leaving 37 dead and 123 injured, according to the latest figure from Egypt's Health Ministry.
Please Wait while comments are loading...