చిక్కుల్లో భారత్- అమెరికా ఆగ్రహంతో ముందునుయ్యి, వెనుక గొయ్యి..?

భారత్ నుంచి ప్రత్యేక ఖలిస్తాన్ కోరుతూ విదేశాల్లో మద్దతు కూడగడుతున్న తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు అమెరికాలో జరిగిన కుట్ర భగ్నమైంది. ఈ మధ్యే ఈ కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. అయితే ఇందులో భారతీయుడి హస్తం ఉన్నట్లు తేలడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను భారత్ కు కూడా షేర్ చేసింది. దీనిపై స్పందించిన భారత్.. ఈ వ్యవహారంపై కమిటీ వేసి విచారణ చేయిస్తోంది. అయినా అమెరికా ఆగ్రహం చల్లారడం లేదు.

భారత్-అమెరికా మధ్య సుదీర్ఘ సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఖలిస్తాన్ తీవ్రవాది హత్యకు అమెరికా గడ్డపై కుట్ర వ్యవహారం ఇరుదేశాల మధ్య మంటలు రేపుతోంది. భారత్‌తో అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉందని అయితే ఈ విషయంలో మాత్రం ఊరుకునేది లేదని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తేల్చిచెప్పేశారు.గురుపత్వంత్ సింగ్ హత్యకు విఫల కుట్రలో ఓ భారతీయుడిపై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.

trouble to india over failed plot to murder khalistan terrorist pannun, US reacted seriously

భారతదేశం తమవ్యూహాత్మక భాగస్వామిగా మిగిలిపోయిందని, అయితే భారతదేశంతో ఆ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి తాము పనిచేస్తున్నట్లు జాన్ కిర్బీ వెల్లడించారు. అదే సమయంలో తాము ఖలిస్తాన్ తీవ్రవాది హత్యకు అమెరికా గడ్డపై జరిగన కుట్రను చాలా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఆరోపణలు, దర్యాప్తును చాలా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. దీంతో భారత్ ఇరుకునపడుతోంది.

ఇప్పటికే అమెరికాతో సంబంధాలు చెడిపోకుండా ఈ వ్యవహారాన్ని సున్నితంగా డీల్ చేస్తున్న భారత్ కు ఇందులో భారతీయుడి పాత్ర సమస్యగా మారింది. ఇప్పుడు అమెరికా న్యాయశాఖ ఆరోపణలు అంగీకరిస్తే కెనడాలో మరో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వ్యవహారం కూడా తెరపైకి వస్తుంది. కెనడాతో ఉన్న సంబంధాలు, అవసరాలతో పోలిస్తే అమెరికా విషయంలో భారత్ లైట్ తీసుకునే పరిస్దితులు లేవు. దీంతో భారత్ కు ఈ వ్యవహారం ముందునుయ్యి వెనుక గొయ్యిలా మారిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+