వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు ఆందోళన: పాక్ షరీఫ్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

నూతనంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. భారతదేశానికి ఆందోళన కలిగించే ప్రకటన చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: నూతనంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. భారతదేశానికి ఆందోళన కలిగించే ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ ట్రంప్.. అధ్యక్షుడు కాగానే తన వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది.

నాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని పేర్కొన్న ట్రంప్‌.. ఇప్పుడు ఏకంగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం పాకిస్థాన్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చారు.

Trump calls Pakistanis intelligent people, Nawaz Sharif a terrific guy

పాకిస్థాన్‌కు చెందిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి తాను సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఫోన్‌ చేసి షరీఫ్‌ అభినందించిన సందర్భంగా.. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

'అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యల పరిష్కారంలోనైనా నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని నేను గౌరవంగా భావించి వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను. నేను అధ్యక్ష పదవి స్వీకరించే జనవరి 20లోపు కూడా కావాలంటే ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు' అని ట్రంప్‌ పేర్కొన్నట్టు పాక్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, తాను పరిష్కరించదలుచుకున్న అపరిష్కృత సమస్యలు ఏమిటన్నది ట్రంప్‌ వివరణ ఇవ్వలేదు.

అంతేగాక, పాక్ ప్రధాని షరీఫ్‌పైనా ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పాకిస్థాన్‌ అద్భుతమైన అవకాశాలు గల దేశమని, పాకిస్థానీలు అద్భుతమైన తెలివితేటలు గల మనుష్యలని పొగడ్తల్లో ట్రంప్ ముంచెత్తారు.

పాకిస్థాన్‌కు రావాల్సిందిగా షరీఫ్‌ ఆహ్వానించగా, ఆ అద్భుతమైన దేశానికి రావడం తనకెంతో ఇష్టమని, పాకిస్థానీలు అద్భుతమైన వ్యక్తులని తాను చెప్పినట్టు వారికి చెప్పాలని షరీఫ్‌కు ఆయన సూచించారు. కాగా, ఉగ్రవాది బిన్ లాడెన్‌ను ఆరేళ్లు దాచినందుకు పాకిస్థాన్ తమకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే పాక్‌తో సత్సంబంధాలు ఉంటాయని ట్వీట్టర్ వేదికగా గతంలో ట్రంప్ స్పందించారు. అంతేగాక, తమకు పాకిస్థాన్ మిత్ర దేశం కాదని వ్యాఖ్యానించారు.

English summary
In a phone call made to the Pakistan Prime Minister, Nawaz Sharif, US president elect, Donald Trump, has said that he is ready to play any role to resolve the country's problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X