భారత్, రష్యాల్ని చైనాకు కోల్పోయాం..! ట్రంప్ మరో షాకింగ్..!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశాలపై అక్కసు వెళ్లగక్కుతున్న డొనాల్ ట్రంప్ ఇదే క్రమంలో వీసాలు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు, వలసల బహిష్కరణలు, సుంకాల మోతలు ఇలా రకరకాలుగా రెచ్చిపోతున్నారు. ఇదే క్రమంలో రష్యా చమురు కొంటున్నారనే కారణం చూపుతూ భారత్ పై ఎన్నడూ లేనంతగా 50 శాతం సుంకాల మోత మోగించారు. దీంతో భారత్ కచ్చితంగా దారికి వస్తుందని లెక్కలేసుకున్న ట్రంప్ కు మోడీ గట్టిగానే షాకిచ్చారు.

సుంకాల మోత ఎదుర్కోకపోయినా అమెరికాకు బద్ధ శత్రువులైన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో మోడీ జట్టు కట్టారు. తాజాగా చైనాలో జరిగిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీవో) సదస్సు సందర్భంగా పుతిన్, జిన్ పింగ్ లతో కలిసి మోడీ కనిపించడం, ముగ్గురూ నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ట్రంప్ కు భారీ షాకిచ్చాయి. దీనిపై వెంటనే స్పందించని ట్రంప్.. ఇప్పుడు అదే ఫొటో షేర్ చేస్తూ తన అక్కసు వెళ్ళగక్కారు.

Trump Claims US Lost India amp amp Russia to China Posts Photo of Modi Putin Xi

అమెరికా.. భారతదేశం, రష్యాలను చీకటి చైనాకు కోల్పోయింది అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వ్యాఖ్యానించారు. అణెరికా, భారత్ సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపే విధంగా ఈ వ్యాఖ్య చేశారు. మనం భారతదేశం , రష్యాలను అత్యంత లోతైన, చీకటి చైనా చేతిలో కోల్పోయినట్లు కనిపిస్తోందని ట్రంప్ తెలిపారు. వారికి కలిసి సుదీర్ఘమైన , సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. దీంతో పాటు టియాంజిన్ భేటీలో పుతిన్ , జిన్‌పింగ్‌లతో కలిసి ప్రధాని మోడీ కనిపించిన చిత్రాన్ని కూడా షేర్ చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు భారత విదేశాంగశాఖ నిరాకరించింది. భారత్ పై ట్రంప్ సలహాదారు నవారో చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఏమీ లేదని విదేశాంగశాఖ తెలిపింది. ఇప్పటికే ట్రంప్-మోడీ మధ్య గతంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలు సైతం క్షీణించాయంటూ అమెరికా మాజీ భద్రతా సలహదారు సహా పలువురు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+