హనోయ్‌లో కిమ్ ట్రంప్ ముందస్తు భేటీ... రంగప్రవేశం చేసిన పోలీసులు

Recommended Video

    Vietnam Detains Impersonators Of Kim Jong Un And Trump | Oneindia Telugu

    హనోయ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు సమావేశమయ్యారు. ఈ సారి హనోయ్‌లో సమావేశమయ్యారు. కానీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. అదేంటి రెండు దేశాల అధ్యక్షులను పోలీసులు పట్టుకోవడమా... అది కూడా అందులో ఒకరు అగ్రరాజ్యం అధినేత ట్రంప్ అనేగా మీ అనుమానం... మీ అనుమానం నివృత్తి కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

     హనోయ్‌లో కిమ్ ట్రంప్ హల్చల్

    హనోయ్‌లో కిమ్ ట్రంప్ హల్చల్

    వియత్నాం రాజధాని హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సమావేశమయ్యారు. అదేంటి వచ్చేవారం కదా ఇద్దరి భేటీ ఉండేది. అంతకంటే ముందే ఎలా సమావేశం అయ్యారు అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ కిమ్ ట్రంప్ డూపులు. వీరు హనోయ్‌లో దర్శనమివ్వడంతో వియత్నాం పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

     కిమ్, ట్రంప్‌లను అరెస్టు చేసిన పోలీసులు

    కిమ్, ట్రంప్‌లను అరెస్టు చేసిన పోలీసులు

    అచ్చం కిమ్ జాంగ్ ఉన్‌లా ఉండే అతని పేరు హోవార్డ్ ఎక్స్, ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లా బిల్డప్ ఇచ్చిన వ్యక్తి పేరు రస్సెల్ వైట్. వచ్చేవారం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు రెండో సారి సమావేశం కానున్న నేపథ్యంలో అంతకంటే ముందు ఈ డూపులు దర్శనమిచ్చారు. వీరిద్దరూ ఓ స్థానిక ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చి వియత్నాం పోలీసులు డూప్లికేట్ కిమ్ ట్రంప్‌లను అదుపులోకి తీసుకున్నారు.

    దేశం విడిచి వెళ్లాలని సూచన

    దేశం విడిచి వెళ్లాలని సూచన

    ఇక పోలీసులు తమను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే దేశం నుంచి బయటకు తన్ని తరుముతామని చెప్పారని కిమ్ డూప్ హోవర్డ్ ఎక్స్ తెలిపారు. వారు హనోయ్‌లో తిరగాలంటే అనుమతులు తీసుకుని తిరగాలని సూచించినట్లు వెల్లడించారు. హాంకాంగ్‌కు చెందిన హోవార్డ్ ఎక్స్ వియత్నాంకు తాను చట్టపరంగానే వచ్చినట్లు తెలిపారు. తనను ఎవరూ బలవంతంగా బయటకు పంపలేరని వ్యాఖ్యానించారు.

    శాంతి చర్చలు సఫలం కావాలని మా వంతు క‌ృషి చేస్తున్నాం

    శాంతి చర్చలు సఫలం కావాలని మా వంతు క‌ృషి చేస్తున్నాం

    ఇక ట్రంప్ డూప్‌లో ఉన్న రస్సెల్ వైట్ తమను అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. ఉత్తరకొరియాతో అమెరికా శాంతి చర్చలు సఫలం కావాలని ఆ దిశగా తమవంతు ప్రయత్నం చేస్తున్నామని రస్సెల్ వైట్ తెలిపారు. మరోవైపు అమెరికా ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేస్తుందని భావిస్తున్నట్లు కిమ్ డూప్ హోవర్డ్ తమాషా చేశారు. ఇక సింగపూర్‌లో కిమ్ ట్రంప్ సమావేశానికి ముందు కూడా ఈ డూపులు హల్చల్ చేశారు. ఇక రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో డూపులు కూడా ఉంటే బాగుండేదని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+