ట్రంప్ ఫోన్.. రూ.కోటి
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినా నేపథ్యంలో .. బంగారు, వజ్రాల హంగులతో రూపుదిద్దుకున్న ఐఫోన్ ను షార్జాకు చెందినా 'గోల్డ్ జెనీ' అనే సంస్థ విక్రయిస్తోంది.
షార్జా: వామ్మో.. మొబైల్ ఫోన్ ఏంటీ.. కోటి రూపాయల ధర ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. ఇది మామూలు ఫోన్ కాదు మరి. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబోతున్న డొనాల్డ్ ట్రంప్ అభిమానుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఐఫోన్.
దీని ధర అక్షరాలా రూ.1.51 లక్షలు. అంటే.. భారతీయ కరెన్సీలో రూ. ఒక కోటి రెండు లక్షలు. దీని ప్రత్యేకత ఏమిటంటారా? ఇది మామూలు ఐఫోనే 7నే. కానీ స్వచ్ఛమైన బంగారంతో చేసిన, వజ్రాలు తాపడం చేసిన స్మార్ట్ కేస్ లో ఉంటుంది. ఈ కేస్ వెనుక భాగాన డొనాల్డ్ ట్రంప్ పేరు, ఫొటో కూడాముద్రించారు.

అత్యంత ఖరీదైన ఈ ఫోన్లను లండన్ కు చెందిన 'గోల్డ్ జెనీ' అనే సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జాలో ఉన్న తన రిటైల్ ఔట్ లేట్ లో విక్రయిస్తోంది. ఉన్నత వర్గాలకు చెందిన వినియోగదారులకు వారు కోరిన విధంగా ఆయా వస్తువులను ఖరీదైనవిగా రూపొందించి ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత.
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినా నేపథ్యంలో .. బంగారంతో చేసిన స్మార్ట్ ఫోన్ల్ కావాలంటూ చైనాకు చెందిన ఓ మహిళ గోల్డ్ జెనీ సంస్థను అడగడంతో ఈ ' ట్రంప్ ఐఫోన్' రూపుదిద్దుకుంది. బంగారు, వజ్రాల హంగులతో రూపొందించిన ట్రంప్ ఫోన్లకు 9 ఆర్డర్లు వచ్చాయని, మున్ముందు మరిన్ని వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని 'గోల్డ్ జెనీ' సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రాంక్ ఫెర్నాండో చెబుతున్నారు.












Click it and Unblock the Notifications