ఆ దేశ అధ్యక్షుడి అరెస్ట్‌పై ట్రంప్ బంపరాఫర్.. కారణం ఇదే?

వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు దారితీసే సమాచారం అందించిన వారికి అమెరికా ప్రభుత్వం భారీ రివార్డును ప్రకటించింది. దీనిని ట్రంప్ ప్రభుత్వం 50 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 438 కోట్లు)కు పెంచింది. ఈ బహుమతి మొత్తం 9/11 దాడుల తర్వాత ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అరెస్టుకు ప్రకటించిన రివార్డు కంటే ఎక్కువ కావడం విశేషం. కొన్నేళ్లుగా అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిని నికోలస్ మదురోను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది.

వెనెజులా అధ్యక్షుడిపై ఆరోపణలు ఏమిటి?
అమెరికా ప్రభుత్వం నికోలస్ మదురోపై ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్లలో మదురో ఒకరని, కార్టెల్స్‌తో కలిసి అమెరికాలోకి ఫెంటానిల్ కలిపిన కొకైన్ సరఫరా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలు కొత్తవేమీ కావు. మదురోపై మొదటిసారిగా 2020లో ట్రంప్ మొదటి పదవీకాలంలో న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టులో నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతి కుట్ర కేసులు నమోదయ్యాయి. అప్పుడు 15 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్ ప్రభుత్వంలో ఇది 25 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక, ఈ రివార్డును 50 మిలియన్ డాలర్లకు రెట్టింపు చేశారు. ఈ చర్య మదురోపై అమెరికా ప్రభుత్వం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది.

Trump s 50 Million Bounty on Venezuelan President Maduro Bigger Than Bin Laden

ఒత్తిడి, బేరసారాలు
అమెరికా తీవ్ర ఒత్తిడి, భారీ బహుమతి ఉన్నప్పటికీ నికోలస్ మదురో అధికారంలో కొనసాగుతున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర లాటిన్ అమెరికన్ దేశాలు అతని 2024 ఎన్నికల విజయాన్ని మోసపూరితమైనదిగా పరిగణించి, అతని ప్రత్యర్థిని అధ్యక్షుడిగా గుర్తించాయి, కానీ మదురో వాటిని లెక్క చేయలేదు. అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం, వెనెజులా మధ్య కొన్ని బేరసారాలు జరిగాయి. వెనెజులాలో బందీలుగా ఉన్న 10 మంది అమెరికన్ పౌరుల విడుదల కోసం ఒక ఒప్పందం చేసుకున్నారు. దీనికి ప్రతిగా, అమెరికా కొన్ని వెనెజులా వలసదారులను తిరిగి తీసుకునేందుకు అనుమతించింది. అంతే కాకుండా అమెరికా చమురు సంస్థ షెవ్రాన్ గతంలో ఆంక్షల కారణంగా నిలిపివేసిన డ్రిల్లింగ్ ను మళ్లీ ప్రారంభించడానికి కూడా అనుమతి లభించింది.

వెనెజులా ప్రతిస్పందన
అమెరికా ప్రకటనపై వెనెజులా కూడా స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్, ఈ రివార్డును జాలిగా అభివర్ణించారు. ఇది ఒక 'చౌక రాజకీయ ప్రచారం' అని విమర్శించారు. అమెరికా అటార్నీ జనరల్ తన వైఫల్యాలను దాచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని గిల్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+