ఎవరూ ఊహించనిది చేయబోతున్నా: ట్రంప్ సంచలనం
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య 6 రోజులుగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఓ వైపు యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే ఇరాన్ లొంగిపోవాలని హుకుం జారీ చేశారు. అయితే ఇరాన్ మాత్రం.. తాము ఎవరికీ తల వంచేది లేదని.. మధ్యలో జోక్యం చేసుకుంటే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ కు ఇప్పటికే చాలా సార్లు చెప్పామని.. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా చాలా ఆలస్యం అయినదిగా భావించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. వారం రోజుల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని స్పష్టం చేశారు. తాను తీసుకోబోయో నిర్ణయాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని ట్రంప్ అన్నారు. ఇరాన్ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ కు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కు చాలా సమయం ఇచ్చామని.. హద్దులు దాటిందని అన్నారు. ప్రస్తుతానికి.. గతవారానికి మధ్య ఇరాన్ చాలా దుందుడుకుగా వ్యవహరించిందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని అన్నారు. తాను ఏం చేస్తానో ప్రపంచానికి తెలియదని అన్నారు.

ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో దుమారం రేపాయి. ఇరాన్ లోని అణు కేంద్రాలను అమెరికా కూల్చ బోతోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నెట్టింట చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications