షాక్: గ్రీన్‌కార్డుల జారీలో లాటరీ పద్దతికి స్వస్తికి ట్రంప్ యోచన

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డు జారీల్లో అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. న్యూయార్క్‌లో ఉగ్రదాడి చోటుచేసుకొన్న నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌కార్డు జారీల్లో అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసేందుకు ట్రంప్‌ భావిస్తున్నారు.. న్యూయార్క్‌లో దాడికి పాల్పడింది ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లోగా గుర్తించిన తర్వాత ట్రంప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

Trump vows to terminate green card lottery after New York attack

వైవిధ్య లాటరీ విధానానికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాలు, గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. గ్రీన్ కార్డుల జారీ కోసం ప్రస్తుతం అవలంభిస్తున్న లాటరీ పథకాన్ని రద్దుకు సత్వరమే కార్యాచరణ మొదలుపెట్టాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరతానని ట్రంప్ ప్రకటించారు.. అయితే వలస విధానాన్ని కఠినతరం చేయడంలో డెమోక్రటిక్‌ ప్రతినిధులు అడ్డుపడుతున్నారని ట్రంప్‌ దుయ్యబట్టారు.

న్యూయార్క్‌లో ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ఆ దుండగుడికి మరణశిక్షే సరైనదని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అవసరమైతే నిందితుడిని గాంటెనామో బే కారాగారానికి పంపించాలని ట్రంప్‌ చెప్పారు. అలాంటి వ్యక్తికి మరణశిక్ష విధించాల్సిందేనని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump on Wednesday vowed that he will terminate the popular green card lottery after an ISIS-inspired Uzbek man who entered the US under the programme killed eight people in New York in the deadliest terror attack in the country since 9/11.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి