వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ భూకంపం.. సునామీ రావచ్చంటూ హెచ్చరిక, భయంతో పరుగులుదీసిన జనం

ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపం నేపథ్యంలో సునామీ కూడా వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మనీలా: ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని ప్రభావం వల్ల పలు భవంతులు దెబ్బతినగా, ఇద్దరు గాయపడ్డారు.

భూకంప తీవ్రత ధాటికి ప్రభుత్వ భవనాలు బీటలుబారాయి. భూకంపం నేపథ్యంలో సునామీ కూడా వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మిండనావో ద్వీపంలో 41 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

Tsunami Warning After 6.8 Magnitude Earthquake Jolts Philippines

శనివారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయంతో నిద్రలేచి, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు హడావుడిగా బయటకు వెళ్లే ప్రయత్నంలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ఈ నెల 12న కూడా మిండనావోలోనే సంభవించిన భూకంపంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఫిబ్రవరిలో మిండనావోలోని సురిగావోలో వచ్చిన భూకంపం వల్ల ఎనిమిది మంది మరణించగా, మరో 250 మందికిపైగా గాయపడ్డారు.

English summary
MANILA: A 6.8-magnitude earthquake struck off the Philippines early Saturday, officials said, damaging several buildings and injuring two people as panicked residents fled the coast following a tsunami warning. The quake struck at 4:23 am at a depth of 41 kilometres (25 miles) off Mindanao island, the US Geological Service said. Residents were jolted from their beds and ran onto the streets as the earthquake shook the area, leaving cracks in a hospital, two government buildings and a port, as well as triggering the collapse of at least one house and causing a brief power outage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X