Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ రెండో నెలలో అడుగు పెట్టింది. ఫిబ్రవరి 28వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. ఇంకా తీవ్రతరమౌతూనే వస్తోంది. దీనిపట్ల అటు అమెరికాలోనూ తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. ఆ దేశ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి కూడా. సమృద్ధిగా ఉన్న యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ అమెరికా దళాలను ఇరాన్ భూభాగంలో మోహరించాలని భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ మరిన్ని రోజులపాటు కొనసాగవచ్చని అంచనా.

రోజురోజుకూ యుద్ధం తీవ్రతరమౌతోండటం అటు అమెరికాలోనూ ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్లు రోడ్ల మీదికి వస్తోన్నారు. నిరసన ప్రదర్శనలను తెలియజేస్తోన్నారు. రాజధాని వాషింగ్టన్ డీసీ కలుపుకొని దాదాపు అన్ని స్టేట్స్, సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యుద్ధానికి తాము వ్యతిరేకమనే విషయాన్ని బాహటంగా తెలియజేస్తోన్నారు. దాడులను విరమించుకోవాలని సూచిస్తోన్నారు.

TUNE IN President Trump will give an Address to the Nation Press secretary Karoline Leavitt says

ఈ పరిణామాల మధ్య ట్రంప్ టీవీ ముందుకు రాబోతోన్నారు. అమెరికాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున 6:30 గంటల సమయంలో) డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణపై కీలక సమాచారం అందిస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె క్లుప్తంగా పోస్ట్ చేశారు.

దేశీయంగా వ్యతిరేకత పెరుగుతోందని ది హిల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను భద్రపరచడానికి ఇరాన్ భూభాగంలో ఎలైట్ ప్రత్యేక దళాలను మోహరించాలని ట్రంప్ భావిస్తోన్నారు. అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఒక కీలక అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ సహా మూడు ప్రాంతాలపై అమెరికా బీ-2 బాంబర్లు ఇదివరకే దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను తగ్గించడమే తమ ఉద్దేశమని ట్రంప్ చెబుతున్నారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో అధికారిక చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయ్ తెలిపారు. రెండు రోజుల కిందటే పాకిస్థాన్‌తో సహా కొన్ని మధ్యవర్తిత్వ దేశాల ద్వారా అమెరికా నుండి ఒక చర్చల అభ్యర్థన, దానితో పాటు కొన్ని ప్రతిపాదనలు తమకు అందాయని ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో సైనిక చర్యలు కొనసాగుతున్నప్పటికీ దౌత్య పరిష్కారం కోసం అమెరికా థర్డ్ పార్టీ దేశాలను ఉపయోగించుకుంటోందని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+