ట్విట్టర్ x ఇకపై పెయిడ్ సర్వీస్: యూజర్లకు మస్క్ మార్క్ షాక్!!
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వినియోగదారులకు షాక్ ఇవ్వటానికి ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చాక ట్విట్టర్ పేరు x గా మారింది. పేరుతో పాటు లోగోను కూడా మార్చిన ఎలాన్ మస్క్ ఇప్పుడు తాజాగా మరో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు.
ఎక్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి ఎలాన్ మస్క్ ఒక పెద్ద ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు. దీని ప్రకారం ఎక్స్ వాడాలంటే ప్రతి యూజర్ కొంత డబ్బులు చెల్లించాల్సిందే అని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సంభాషణ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ వినియోగదారులను డబ్బులు చెల్లించమనడం వెనుక ఒక కారణం ఉందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.

ఎక్స్ లో వస్తున్న బాట్స్ ను తొలగించడానికి ఇదే సరైన పద్ధతని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ లో 550 మిలియన్ల యూజర్లు ఉంటున్నారని ప్రతిరోజు కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు ఉంటున్నాయని పేర్కొన్నారు. అందులో బాట్స్ కూడా ఉంటాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
ఇక బాట్స్ పోవాలంటే కొద్దిగా అయినా డబ్బులు కట్టాలని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి, మస్క్ అనేక మార్పులు చేశారు . ఎలాన్ మస్క్ నిషేధించబడిన ఖాతాలు మళ్ళీ రావటానికి అనుమతిని ఇచ్చాడు. అంతేకాదు బ్లూ చెక్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను తొలగించాడు.
అయితే డబ్బులు చెల్లింపు విషయంలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. కానీ ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం తీసుకోవాలంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు నెలకు 900రూపాయలు చెల్లించాలి. అదే వెబ్ యూజర్లు 650రూపాయలు చెల్లించాలి. ఇక మీదట ఎలాన్ మస్క్ ప్రకటనను బట్టి మామూలు యూజర్లు కూడా కొంత మొత్తం డబ్బును చెల్లించాల్సి ఉందన్నది దీని సారాంశం. అయితే ఇది ఎప్పటి నుండి అనేది మాత్రం ఇంకా అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications