రాజునే బ్లాక్ మెయిల్ చేసి జైలుపాలైనారు
ప్యారిస్: రాజు రహస్యాలు బయటకు రాకుండ ఉండాలంటే మాకు భారీ మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. హాయిగా సమాజానికి అవసరమైన వార్తలు వ్రాసుకోకుండ ఏకంగా ఒక రాజుతో పెట్టుకున్నారు.
మురాకో రాజు మహమ్మద్- 6 అనే రాజును బెదిరించిన ఎరిక్ లారెంట్, కేథరిన్ గ్రాసియెట్ అనే ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులను గురువారం రాత్రి అరెస్టు చేశారు. మొరాకో రాజు మహమ్మద్ -6 న్యాయవాది ఎరిక్ డుపాంట్ మొరెట్టి తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
జర్నలిస్టులు ఎరిక్ లారెంట్, కేథరిన్ గ్రాసియెట్ రాజు మహమ్మద్ -6 కార్యకలాపాలు, పాలనతో కూడిన పూర్తి వివరాలతో ఒక పుస్తకం వ్రాస్తున్నామని ప్రచారం చేశారు. ఆ పుస్తకం ప్రచురించకుండ ఉండాలంటే మూడు మిలియన్ యూరోలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు.

లేదంటే రాజు రహస్యాలు బయటకు వస్తాయని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న రాజు సంస్థాన కార్యాలయం అధికారులు నిఘా వేశారు. మొదట కేసు నమోదు చేశారు. డబ్బులు ఇస్తామని ఇద్దరు జర్నలిస్టులను నమ్మించారు.
గురువారం రాత్రి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇద్దరు జర్నలిస్టులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఇద్దరిని జైలుకు పంపించామని న్యాయవాది ఎరిక్ డుపాంట్ మొరట్టి తెలిపారు.












Click it and Unblock the Notifications