అగ్నిప్రమాదం: ఇద్దరు భారత విద్యార్థినుల మృతి
న్యూఢిల్లీ: రష్యాలోని స్మోలెనెస్క్ స్టేట్ వైద్య విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థినులు పూజా కళ్లూరు, కరిష్మా బోసలే మృతి చెందారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మరికొందరికి గాయాలయ్యాయని అధికార బృందం వారి యోగక్షేమాల తెలుసుకునేందుకు రష్యా బయలుదేరిందని చెప్పారు.. వారి మృతదేహాలను గురువారం నాటికి ముంబైకి తీసుకురానున్నామని ఆమె పేర్కొన్నారు.

We have lost two Indian girl students (both from Maharsthra) studying at Smolensk Medical Academy in Russia in a fire accident.@RajeGangarde
— Sushma Swaraj (@SushmaSwaraj) February 15, 2016
రష్యాలో భారీ పేలుడు
రష్యాలోని యారోస్లావ్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం ఉదయం గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. భవనంలో 20 మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు నలుగురిని రక్షించినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడని అతని మృతదేహాన్ని వెలికి తీశామని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో భవనంలో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బయటపడిన నలుగురిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications