కలానికి సంకెళ్లు: ఇద్దరు రైటర్స్ జర్నలిస్టులను దోషిగా పేర్కొన్న మయన్మార్ కోర్టు..ఎందుకో తెలుసా..?
దేశ రహస్యాలు బయటకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది మయన్మార్ కోర్టు. వాలోన్, కా సో ఆనాటి దేశ రహస్యాలను బయట పెట్టారని... ఇందుకు సంబంధించిన రహస్య పత్రాలు లీకు చేశారని కోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే ప్రెస్ అడ్వొకేట్స్, ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ సమాఖ్య, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఈ ఘటనను ఖండించాయి. వారు నిర్దోషులని పేర్కొన్నాయి.
"ఈ రోజు ప్రతికా స్వేచ్ఛకు, మయన్మార్‌కు రైటర్స్ జర్నలిస్టులకు బ్లాక్ డే " అని రైటర్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ స్టీఫెన్ జే ఆడ్లర్. ఇదిలా ఉంటే ఇద్దరు పోలీసు అధికారులు కొన్ని డాక్యుమెంట్లు రెస్టారెంటులో ఉన్న తమకు అందజేశారని ఆ వెంటనే ఇతర పోలీసులు వచ్చి తమను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు.

అయితే రెస్టారెంట్లో ఇద్దరి జర్నలిస్టులను అరెస్టు చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి ముందస్తు ప్రణాళికతో వారిని రప్పించినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారిని దేశ రహస్యాలు చేరవేస్తున్నందుకు కాదని రోహింగ్యా ముస్లింల ఊచకోతలో రిపోర్టింగ్ చేసినందుకు అరెస్టు చేశామని చెప్పారు.
ఇదిలా ఉంటే తన బెదిరే వ్యక్తిని కాదని. తనకు న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం, స్వతంత్రతపై నమ్మకం ఉందన్నారు వాలోన్. గత 9 నెలలుగా వారి కుటుంబసభ్యులను చూపించకుండా పోలీసులు నిర్భంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సో అనే జర్నలిస్టుకు మూడేళ్ల కూతురుండగా...వాలోన్ అనే మరో జర్నలిస్టు భార్య ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది డిసెంబర్ 12న ఇద్దరి జర్నలిస్టులను అరెస్టు చేశారు. 10 మంది రోహింగ్యాల ఊచకోతపై వీరు విచారణ చేస్తూ రిపోర్టింగ్ చేస్తున్నారు.అయితే మయన్మార్ ప్రభుత్వం మాత్రం చట్టం తనపని తాను చేసుకుని పోతుందని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications