అమెరికా కోర్టులో సోనియా గాంధీకి ఊరట
న్యూయార్క్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై 1984 నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్‌ను యూఎస్ కోర్టు కొట్టివేసింది.
ఈ ఘటనలో సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది.
పిటిషన్ విచారణకు స్వీకరించిన జడ్జీలు జోస్ కాబ్రేన్స్, రెన్నా ర్యాగీ, రిచర్డ్ వెస్లీ.. ఈ కేసుతో సోనియాగాంధీకి సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలను ఎస్‌ఎఫ్‌జే సమర్పించలేకపోయిందని పేర్కొన్నారు.

పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణల్లో పరిపక్వత లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎస్‌ఎఫ్‌జే ఏ కొత్త విషయాన్నీ కోర్టుకు వెల్లడించడంలేదని.. పాత విషయాలనే మళ్లీ మళ్లీ చెప్తున్నదని పేర్కొంది.
తీర్పుపై సోనియాగాంధీ తరఫు న్యాయవాది రవి బాత్రా హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌జే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications