• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్:ఫైజర్ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ -యూకే ప్రభుత్వ హెచ్చరిక -మాస్ వ్యాక్సినేషన్ వేళ కలకలం

|

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించిన బ్రిటన్ లో 24 గంటలైనా తిరక్కముందే కలకలం రేగింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చోటుచేసుకుంటున్నట్లు స్వయంగా బ్రిటన్ ప్రభుత్వమే చెప్పింది. ఫైజర్ టీకాను తీసుకునే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

RRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామRRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ

 మాస్ వ్యాక్సినేషన్ వేళ..

మాస్ వ్యాక్సినేషన్ వేళ..

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్), మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ)లు ఈ మేరకు బుధవారం కీలక ప్రకటనలు చేశాయి. ఫైజర్ సంస్థ తన జర్మన్ భాగస్వామి బయోఎన్ టెక్ తో కలిసి రూపొందించిన వ్యాక్సిన్ ను యూకే ప్రభుత్వం ప్రోయోగాత్మకంగా వినియోగానికి వాడుతోంది. మంగళవారం నుంచి ముందుగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను అందిస్తోన్న ఆ దేశం.. విడతలవారీగా మాస్ వ్యాక్సినేషన్(సామూహిక టీకాల పంపిణీ) కూడా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఊహించని రీతిలో..

24 గంటల్లో ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్

24 గంటల్లో ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్

ఫైజర్ టీకాను బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ స్టాఫ్ కు అందించగా, వారిలో ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఆ ఇద్దరినీ ఆస్పత్రిలోనే ఉంచి, ప్రత్యేక చికిత్స అందిస్తున్నది. ప్రయోగాత్మకంగా టీకా తీసుకున్న ఆ ఇద్దరికి ఒళ్లు దురద, వాంతులు, తలనొప్పి వంటి అలెర్జిక్ లక్షణాలు తలెత్తాయని, టీకా తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇలాంటి లక్షణాలొస్తే తక్షణమే ఆస్పత్రుల్లో చేరాలని యూకే ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతేకాదు, అలెర్జీ లక్షణాలున్నవారు టీకాను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే..

ఎందుకిలా జరిగింది?

ఎందుకిలా జరిగింది?

టీకా తీసుకున్న వాళ్లలో సైడ్ ఎఫెక్ట్ కు గురైన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇలా ఎందుకు జరిగిందనేదానిపై ఫైజర్ సంస్థను వివరణ కోరామని, టీకా తయారీ దారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్ మీడియాకు తెలిపారు. అలర్జీ కంప్లెయింట్స్ చరిత్ర ఉన్నవాళ్లెవరూ వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని ఫైజర్ సంస్థ సూచించిందని ఆయన చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ సేఫ్టీ డేటాను మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని, ప్రస్తుతానికి టీకాల పంపిణీ యధావిధిగా కొనసాగుతుందని స్టీఫెన్ పేర్కొన్నారు. కాగా,

40లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్

40లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్

ఇప్పటిదాకా అమెరికాలోనే ఆమోదం పొందని ఫైజర్ టీకాను బ్రిటన్ లో వాడేందుకు బోరిస్ సర్కారు అనుమతివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మాస్ వ్యాక్సినేషన్లకు అనుమతిచ్చిన మొదటి దేశంగా బ్రిటన్.. మంగళవాంర నుంచే ప్రక్రియ మొదలుపెట్టింది. 90ఏళ్ల మార్గరెట్ కీనట్ తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫొటోలు వైరలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివ‌రిలోగా 40 ల‌క్ష‌ల మందికి ఫైజర్ టీకాను అందించాలనుకుంటోన్న బ్రిటన్.. ఆ మేరకు పంపిణీ ఏర్పాట్లు కూడా చేసుకుంది. మొత్తం నాలుగు కోట్ల టీకాల కోసం బ్రిటన్ ఆర్డర్ పెట్టుకుంది.

ఏపీలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే -గ్లోబల్‌గా 9వ స్థానంలో భారత్ -ట్రూకాలర్ షాకింగ్ రిపోర్ట్ఏపీలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే -గ్లోబల్‌గా 9వ స్థానంలో భారత్ -ట్రూకాలర్ షాకింగ్ రిపోర్ట్

English summary
ritain's medicine regulator has advised that people with a history of significant allergic reactions do not get Pfizer-BioNTech's Covid-19 vaccine after two people reported adverse effects on the first day of rollout. Britain began mass vaccinating its population on Tuesday in a global drive that poses one of the biggest logistical challenges in peacetime history, starting with the elderly and frontline workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X