మోడీ జీ: జర జోక్యం చేసుకోరాదు, రష్యాకు చెప్పరాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడి మొర
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగింది. ఏకపక్షంగా యుద్ధ విమానాలను పంపించి.. బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఉక్రెయిన్ స్నేహ హస్తం కోసం చూస్తోంది. ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యాలో ఉన్నారు. యుద్దం.. ఇతర అంశాలపై డిస్కష్ చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతుంది.
Recommended Video
రష్యాతో భారత్ అనుబంధం ప్రత్యేకమైంది. భారత్- పాక్ ఘర్షణ సమయంలో అమెరికా పాక్ వైపు నిలబడితే.. రష్యా భారత వైపున నిలుచుంది. ఈ క్రమంలో భారత్ చెబితే రష్యా వింటుందని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇరుదేశాల మధ్య అనుబంధం ఉండటంతో.. ఇండియా మాటకు రష్యా గౌరవం ఇస్తోందని అభిప్రాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని అడుగుతుంది. ఈ మేరకు తమ అధ్యక్షుడు జెలన్స్కీ కోరారని భారత్‌లో ఉక్రెయిన్ రాయబరి ఇగొర్ పొలిఖా పేర్కొన్నారు.

అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్దంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఏ దేశం వైపు నిలవబోమని కుండబద్దలు కొట్టింది. కానీ శాంతిని పునరుద్దరించేందుకు చర్యలు మాత్రం తీసుకోవాలని కోరుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ మధ్యవర్తిత్వం వహించాలని కోరడం విశేషం. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను దేశం తీసుకురావడంపై దృష్టిసారించామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వారి కోసం 24 గంటలపాటు అందుబాటులో కంట్రోల్ రూమ్ ఉంటుందని వివరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లిట్యా తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ నాయకత్వం నుంచి రష్యా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని కోరారు. ఉద్రిక్తతల గురించి చర్చించే సమయం మించిపోయిందని.. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు సోవియెట్ రష్యాలో భాగమైన ఉక్రెయిన్ ఇప్పుడు యురోపియన్ యూనియన్‌కు దగ్గరవడం రష్యాకు ఏమాత్రం మింగుడుపడట్లేదు. ఉక్రెయిన్‌ని తమతో చేర్చుకోమని హామీ ఇవ్వాల్సిందిగా అమెరికా, నాటోని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటో పక్షం చేరవద్దని.. అది తటస్థంగానే ఉండాలని అంటున్నారు. పశ్చిమ దేశాలు పుతిన్ డిమాండ్లను తిరస్కరిస్తున్నాయి. ఉక్రెయిన్ ద్వారా పశ్చిమ దేశాల నుంచి రష్యాకు ముప్పు ఉంటుందని పుతిన్ భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడికి పూనుకున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications