తెగించిన రష్యా: యూరప్‌పై గ్యాస్ వార్: ఉక్రెయిన్ ఆందోళన

టెహ్రాన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. 154 రోజులుగా యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది..తిప్పి కొడుతోంది.

పలు నగరాలు నేలమట్టం..

పలు నగరాలు నేలమట్టం..


ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని కాపాడుకోవడంలో ఉక్రెయిన్ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

 ఉక్రెయిన్ దూకుడుకు..

ఉక్రెయిన్ దూకుడుకు..

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోతోంది. జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు. పునరావాస భవనాలపైనా దాడులను సాగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

 రూటు మార్చిన రష్యా..

రూటు మార్చిన రష్యా..


ఈ పరిణామాల మధ్య రష్యా రూటు మార్చింది. కొత్తగా గ్యాస్ వార్‌ను ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఆయా దేశాలకు సరఫరా చేసే గ్యాస్‌లో కోత పెట్టింది. దీనిపై రష్యా ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోన్న గ్యాస్ కంపెనీ గజ్‌ప్రామ్ ఓ ప్రకటన చేసింది. నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ మీదుగా యూరోప్ దేశాలకు సరఫరా చేస్తోన్న రోజువారీ గ్యాస్‌ సరఫరాను 33 మిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గించినట్లు వెల్లడించింది.

ఇటీవలే పునరుద్ధరణ..

ఇటీవలే పునరుద్ధరణ..


వార్షిక మరమ్మతు కార్యకలాపాల కోసం నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌లో గ్యాస్ సరఫరాను 10 రోజుల పాటు గజ్‌ప్రామ్ నిలిపివేసింది. మరమ్మతు పూర్తయిన తరువాత గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. ఈ పైప్‌లైన్ పూర్తిస్థాయి సామర్థ్యానికి 40 శాతం మాత్రమే గ్యాస్‌ను సరఫరా చేస్తోన్నట్లు ప్రకటించింది. ఆయిల్ అండ్ గ్యాస్ కోసం యూరోప్ దేశాలన్నీ రష్యా మీదే ఆధారపడి ఉన్న నేపథ్యంలో- గజ్‌ప్రామ్ తీసుకున్న తాజాగా చర్యతో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

తప్పు పట్టిన ఉక్రెయిన్

తప్పు పట్టిన ఉక్రెయిన్

యూరప్‌కు సరఫరా చేసే గ్యాస్‌లో రష్యా కోత పెట్టడాన్ని ఉక్రెయిన్ తప్పు పట్టింది. యూరప్‌పై రష్యా అనధికారికంగా బహిరంగ గ్యాస్ యుద్ధాన్ని ప్రకటించిందని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాలో కోత పెట్టడం వల్ల పరోక్షంగా యూరోప్‌పై రష్యా యుద్ధానికి దిగినట్టయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా తమ ఆంక్షలను మరింత తీవ్రతరం చేయాలని ఆయన యూరప్‌కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+