వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పలేదు.. రాత్రంతా చెట్టు మీదే ఉండిపోయిన పైలెట్

|
Google Oneindia TeluguNews

బెర్లిన్ : 'చెట్టు కింద ప్లీడర్' లాగా.. చెట్టు మీద పైలెట్ ఏంటనుకున్నారా? ఓ చిన్న విమాన ప్రమాదంతో.. పైలెట్ 12 గంటల పాటు చెట్టు మీదే ఉండిపోయాడు. రాత్రి సమయం కావడం.. 30 మీటర్ల ఎత్తున్న చెట్టు మీద పైలెట్ చిక్కుకుపోవడంతో.. సహాయక చర్యలు వీలు పడలేదు. దీంతో సదరు పైలెట్ రాత్రంతా అదే చెట్టుపై గడపాల్సి వచ్చింది.

అసలు విషయమేంటంటే.. జర్మనీలో ఓ తేలికపాటి విమానం చెట్ల మీద కూలిపోయింది. జర్మనీ నైరుతి ప్రాంతంలో గల బాడెన్ - వుర్టెమ్ బెర్గ్ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందేసరికి చీకటికి పడింది.

Ultralight pilot in Germany spends night in tree after crash

అనంతరం అక్కడకు చేరుకున్న అదికారులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి.. ఆ సమయంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడమే మంచిదని నిర్దారించారు. ఒకవేళ సహాయ చర్యల్లో ఏమైనా తప్పిదం చోటు చేసుకుంటే.. 30 అడుగుల ఎత్తు నుంచి విమానం కిందపడినప్పుడు మంటలు చెలరేగే అవకాశం ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో ఆ పైలెట్ కు చెట్టు మీదే నిద్రపోక తప్పలేదు.

కాగా, మరుసటిరోజు ఉదయం చెట్లల్లో చిక్కుకుపోయిన ఆ 59 ఏళ్ల పైలెట్ ను అధికారులు సురక్షితంగా రక్షించారు. ప్రమాద ముప్పు తప్పడంతో.. పైలెట్ తో పాటు మిగతా అధికారులంతా 'హమ్మయ్యా' అనుకున్నారు.

English summary
The pilot of an ultralight aircraft in Germany spent more than 12 hours stuck up a tree after rescuers were unable to reach him overnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X