వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్ లో ఆహార సంక్షోభం-రెండో ప్రపంచయుద్ధం తర్వాత దారుణంగా

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి నెలరోజులు దాటిపోయింది. అయినా ఎలాంటి ఫలితం లేదు. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నా తుది ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఉక్రెయిన్ లో సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్కడ రష్యా దాడులతో ఆహార సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభం తలెత్తింది. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. దీనిపై ఐరాస తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది.

ఐరాస ఆహార విభాగం ఛీఫ్ ఉక్రెయిన్‌లో యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాలపై స్పందించరు. ఈ యుద్ధం విపత్తుపై విపత్తు సృష్టించిందని, రెండవ ప్రపంచ యుద్ధం నుంచి మనం చూసిన దేనికంటే కూడా దారుణ ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. ఎందుకంటే చాలా మంది ఉక్రేనియన్ రైతులు గణనీయమైన మొత్తాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలోని గోధుమలు ఇప్పుడు రష్యన్‌లతో పోరాడుతున్నాయంటూ అక్కడి గోధుమల ఉత్పత్తిపై పడుతున్న యుద్ధ ప్రభావాన్ని ఆయన అభివర్ణించారు.

UN Says Ukraine wars food crisis is worst since second world war

ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న దాడులతో ఆహార ఉత్పత్తి నిలిచిపోవడమే కాకుండా ఆహారం అందక మరణాలు కూడా సంభవించే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు సాయానికి ప్రయత్నిస్తున్నా పూర్తి ఫలితం మాత్రం రావడం లేదు. మానవతా కారిడార్ కు ఏర్పాటు చేసి ఇలాంటి వారికి సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరుతున్నా రష్యా మాత్రం అందుకు సహకరించడం లేదు. దీంతో అందుబాటులో ఉన్న మార్గాల్లోనే తమ ప్రజల్ని రక్షించుకునేందుకు జెలెన్ స్కీ పోరాడుతున్నారు.

English summary
un said that food crisis in ukraine is worst since second world war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X