వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా అణుపరీక్షలు: భద్రతా మండలి ఎమర్జెన్సీ మీటింగ్, సైనిక చర్య?

ప్రపంచదేశాలను తన చర్యలతో వణికిస్తోన్న ఉత్తరకొరియాతో తీరుతో ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమైంది. సోమవారం ఉదయం పది గంటలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భేటీ జరిగింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచదేశాలను తన చర్యలతో వణికిస్తోన్న ఉత్తరకొరియాతో తీరుతో ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమైంది. సోమవారం ఉదయం పది గంటలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భేటీ జరిగింది.

యుద్దానికి ఉత్తరకొరియా: 6వ, అణుపరీక్ష చేసిన ఉ.కొరియా, భూకంపాలుయుద్దానికి ఉత్తరకొరియా: 6వ, అణుపరీక్ష చేసిన ఉ.కొరియా, భూకంపాలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ఉన్ వ్యవహరశైలిపై ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సహ పలు దేశాలు ఉత్తరకొరియాను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.

ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్

అణుపరీక్షలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూ ప్రత్యర్థి దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది ఉత్తరకొరియా. హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా పరీక్షించిన విషయం ప్రపంచదేశాలను షాక్‌కు గురిచేసింది.

ట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియాట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియా

బ్రిక్స్ దేశాల సమావేశాన్ని పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు కూడ ఉత్తరకొరియా తీరును ఎండగట్టారు. తన పద్దతిని మార్చుకోవాలని ఆయన ఉత్తరకొరియాను కోరారు.

ఉత్తరకొరియా అణుపరీక్షలపై చర్చ

ఉత్తరకొరియా అణుపరీక్షలపై చర్చ

ఉత్తరకొరియా తీరుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హలె తన ట్విట్టర్‌లో ధృవీకరించారు. అమెరికాతో పాటు జపాన్, ఫ్రాన్స్, యూకే, దక్షిణ కొరియాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటాయని హలె ప్రకటించారు. ఉత్తరకొరియా తీరుపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్టు హలె ప్రకటించారు.

సైనిక చర్యకు దిగుతామన్న అమెరికా

సైనిక చర్యకు దిగుతామన్న అమెరికా

తమతో పాటు తమ మిత్రదేశాల జోలికి వస్తే సైనిక చర్యకు దిగుతామని అమెరికా సైనికాధికారి జేమ్స్ మట్టిస్ తీవ్రంగా హెచ్చరించారు.ఉత్తరకొరియా తీరును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఎండగట్టారు. ఉత్తరకొరియాను మూర్ఖపు దేశమని ట్రంప్ దుయ్యబట్టారు.

అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిన ఉత్తరకొరియా

అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిన ఉత్తరకొరియా

6వ,సారి ఉత్తరకొరియా అణుపరీక్షలు నిర్వహించడాన్ని భారత్‌ కూడ తీవ్రంగా తప్పుబట్టింది. అణ్వాయుధాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఉత్తరకొరియా పెద్ద తప్పు చేసిందని భారత విదేశాంగశాఖ అభిప్రాయపడింది. బ్రిక్స్ సదస్సులో ఈ విషయమై సీరియస్‌గా చర్చించారు.

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు

ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని భద్రతా మండలికి బ్రిటీషన్ ప్రధాని థెరిసా కోరారు. అయితే ఈ ఆంక్షలు ఉత్తరకొరియాపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదని రష్యా అభిప్రాయపడింది. ఉత్తరకొరియాకు రష్యా పరోక్షంగా సహకరిస్తోంది.

English summary
The U.S. and other partner countries Sunday called for an emergency meeting of the United Nations Security Council in the wake of North Korea's claims that it successfully detonated a hydrogen bomb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X