ఓమిక్రాన్ పై ఊరట-యూఎస్, బ్రిటన్ లో తగ్గుముఖం-భారత్ లోనూ రెండు మూడు వారాల తర్వాత
భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జనవరి చివరి నాటికి ఇది పీక్ కు చేరొచ్చని కూడా అంచనాలు వెలువడ్డాయి. అందులోనూ ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో కోవిడ్ 19 ధర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. అదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇప్పటికే పతాకస్ధాయికి చేరిన ఓమిక్రాన్ కేసులు త్వరలో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్రిటన్‌లో కోవిడ్ 19 భయంకరమైన ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకుందని, త్వరలో యుఎస్‌లో కూడా అదే పరిస్ధితి ఉండబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత ఎలాగో ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాఫ్రిలో తొలిసారి ఇది వెలుగుచూశాక ఇతర దేశాలకు వ్యాప్తించింది. ఇందులో బ్రిటన్, యూఎస్, భారత్ తో పాటు పలు దేశాలు ఉన్నాయి. అయితే అది వ్యాప్తి చెందిన విధానాన్ని బట్టి చూస్తే ముందుగా వ్యాపించిన బ్రిటన్, యూఎస్ వంటి దేశాల్లో ఇప్పటికే పీక్ స్టేజ్ కు చేరుకుంది. మిగతా దేశాల్లో ఇంకా పతాకస్ధాయి కనిపించడం లేదు. సీటెల్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో హెల్త్ మెట్రిక్ సైన్సెస్ ప్రొఫెసర్ అలీ మొక్దాద్ అంచనాల ప్రకారం ఇది ఎంత వేగంగా పైకి వెళ్లిందో అంత వేగంగా తగ్గుతుందని తెలుస్తోంది.

అదే సమయంలో, ఓమిక్రాన్ మహమ్మారి తదుపరి దశ ఎలా బయటపడుతుందనే దానిపై ఇంకా చాలా అనిశ్చితంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఎస్, బ్రిటన్ దేశాలలో ఈ కేసుల క్షీణత ప్రతిచోటా ఒకే సమయంలో, అదే వేగంతో జరగదని తెలుస్తోంది. కేసులు తగ్గే అవకాశమున్నా ఇప్పటికే వైరస్ సోకిన రోగుల సంఖ్య మాత్రం అప్పుడే తగ్గకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు జనవరి 19 నాటికి అమెరికాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య రోజుకు 12 లక్షలకు చేరుకుంటుంది. అదే గతంలో ఆరు మిలియన్లు కూడా ఉంది. దీంతో అమెరికాలో వైరస్ వ్యాప్తి తగ్గినట్లు అర్ధమవుతోంది.
అలాగే బ్రిటన్ లోనూ ప్రస్తుతం గత వారంలో రోజువారీ కేసులు లక్షా 40 వేలకు పడిపోయాయి. ఈ నెల ప్రారంభంలో రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ కేసులు నమోదై ఓమిక్రాన్ పతాకస్ధాయికి చేరింది. నైరుతి ఇంగ్లాండ్, వెస్ట్ మిడ్‌లాండ్స్ వంటి ప్రదేశాలలో కేసులు ఇంకా పెరుగుతున్నప్పటికీ, వైరస్ వ్యాప్తి లండన్‌లో గరిష్ట స్థాయికి చేరుకుందని బ్రిటన్ ఓపెన్ యూనివర్శిటీలో అప్లైడ్ స్టాటిస్టిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కెవిన్ మెక్‌కాన్వే అన్నారు. ఈ గణాంకాలు దక్షిణాఫ్రికాలో జరిగినట్లుగానే రెండు దేశాలు జరగబోతున్నాయని ఆశలు రేకెత్తించాయి, అక్కడ సుమారు నెల రోజుల వ్యవధిలో కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత పరిస్దితి తగ్గుముఖం పడుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications