జపాన్ టూర్: ఫాస్ట్ బీట్‌కు దరువేసిన ప్రధాని (పిక్చర్స్)

టోక్యో: జపాన్ పర్యటనలో భాగంగా నాల్గవ రోజు ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం ఓ పాఠశాలలో ప్లూట్ వాయించి ఆకట్టుకోగా... ఈరోజు డ్రమ్స్ వాయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

నాలుగు రోజుల జపాన్ పర్యటనలో ఉన్న భారత్ ప్రధాన నరేంద్ర మోడీ తనలో దాగున్న సంగీత కళలను ఒక్కొక్కటీ వెలికి తీస్తున్నారు. మూడో రోజు సోమవారం తైనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మోడీ జపాన్‌లో విద్యా విధానం అమలు తీరును పరిశీలించారు.

ఆ తర్వాత విద్యార్థులతో కలిసిపోయిన ఆయన వాళ్లతో పాటు ఫ్లూట్ వాయించారు. పాఠశాలలో పిల్లలందరూ 7-8 ఎనిమిదేళ్ల వయసువారే. అదే సమయంలో పాఠశాలలో సంగీతం క్లాసులు జరుగుతుండడంతో మోడీ కూడా వాళ్లతో జతకలిశారు. పిల్లలలతోపాటు ఫ్లూట్ వాయించి ఉత్సాహపరిచారు.

నాల్గవ రోజైన ఈరోజు బీట్ ప్రకారం డ్రమ్ వాయించి అందరిని అబ్బురపరిచారు. మంగళవారం ఉదయం నరేంద్రమోడీ టోక్యోలో టీసీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ సాంప్రదాయ టైకో డ్రమ్స్ వాయించాలంటూ టీసీఎస్ సీఈఓ చంద్రశేఖర్ ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న మోడీ డ్రమ్ ఎలా వాయిస్తారో గమనించి.. అదే విధంగా డ్రమ్స్‌పై ఫాస్ట్ బీట్ వాయించి అక్కుడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశారు.

 ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ రాజు అకిహితో కరచాలనం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ రాజు అకిహితో చర్చలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.

 ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

జపాన్ పర్యటనలో భాగంగా ఈరోజు డ్రమ్స్ వాయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ఆ తర్వాత పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు భారత్ కన్నా ఉత్తమమైన దేశం ఏదీ లేదన్నారు.

 ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

మంగళవారం ఉదయం నరేంద్రమోడీ టోక్యోలో టీసీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న నరేంద్ర మోడీ.

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన

మంగళవారం ఉదయం టోక్యోలని సెక్రెడ్ హాట్ విశ్యవిద్యాలయంలో జపాన్ విద్యార్దులనుద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే పాల్గోన్నారు.

ఆ తర్వాత పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు భారత్ కన్నా ఉత్తమమైన దేశం ఏదీ లేదన్నారు.

ఇటీవల రక్షణ సహా అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో పదేళ్ళలో మీరు సాధించిన అధ్బుతాన్ని రెండేళ్లలో భారత్‌లో ఆవిష్కరించవచ్చునని పారిశ్రమికవేత్తలను కోరారు. ఇప్పుడు భారత్ అవకాశాల స్వర్గం, రండి కలిసి పనిచేద్దామని జపాన్ పారిశ్రమికవేత్తలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+