అమెరికా భారీ తప్పిదం-వీరిని చంపొద్దంటూ తాలిబన్లకు లిస్ట్-వాళ్లే టార్గెట్-రేసుగుర్రం సీన్ రిపీట్

టాలీవుడ్ మూవీ రేసుగుర్రంలో ఓ సీన్ ఉంటుంది. విలన్ మద్దాలి శివారెడ్డికి చెందిన కంపెనీలపై పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే ( బ్రహ్మానందం) దాడులు చేస్తుంటాడు. అదే సమయంలో ప్రతీ కంపెనీకి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది ఇది మద్దాలి శివారెడ్డి కంపెనీ అని తెలియదా అని ప్రశ్నిస్తుంటారు. దీంతో అక్కడికక్కడే శివారెడ్డితో మాట్లాడి ఇది మీ కంపెనీ అని తెలియదని చెప్తాడు. ఇలా రెండు, మూడు కంపెనీలకు వెళ్లాక.. ఇలా కాదు కానీ మీ బినామీ కంపెనీల లిస్ట్ ఇచ్చేయమని అడుగుతాడు. దీంతో శివారెడ్డి అమాయకంగా ఆ లిస్ట్ పంపిస్తాడు. ఆ తర్వాత అవే కంపెనీల్ని సీజ్ చేసేస్తాడు. సేమ్ ఆప్ఘనిస్తాన్ లో తాజా బాంబుదాడుల వెనుక జరిగిందిదే...

ఆప్ఘన్ రక్త చరిత్ర

ఆప్ఘన్ రక్త చరిత్ర

ఆప్ఘనిస్తాన్ చరిత్ర చూస్తే రక్తపాతం లేకుండా అధికారం చేతులు మారిందీ లేదు, ప్రజలు జీవించిందీ లేదు. అలాంటిది ఎలాంటి రక్తపాతం లేకుండా తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం సాధించుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దీని వెనుక చాలా జరిగిందనేది ఇప్పుడిప్పుడే అందరికీ అర్దమవుతోంది. తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 200 మంది చనిపోయారని అందరికీ తెలుసు. కానీ వీరిలో అత్యధికులు గతంలో అమెరికా తాలిబన్లకు ఇచ్చిన జాబితాలో ఉన్న వారేనని తెలిసింది కొందరికే.

 బాంబుదాడుల వెనుక ?

బాంబుదాడుల వెనుక ?

తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా సైనికులు, ఆప్గన్ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన జంట బాంబుపేలుళ్లు దాదాపు 200 మందిని పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బాంబుదాడుల్ని ఎవరు చేశారు, ఇంకెవరు చేయించారన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కానీ చేయించింది ఎవరైనా చేసింది మాత్రం ఉగ్రవాద సంస్ధ ఐసిసే అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. దీంతో ఈ బాంబు దాడులకు కుట్ర పన్నింది ఎవరు, వారు చెప్పినట్లు ఐసిస్ ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందనే దానిపై మరింత ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.

 అమెరికా భారీ తప్పిదం

అమెరికా భారీ తప్పిదం

కాబూల్ ఎయిర్ పోర్టులో జంట దాడుల వెనుక మనకు కనిపిస్తోంది ఐసిస్, తాలిబన్లు అయితే కనిపించని అసలు కారణం అమెరికానే. అగ్రరాజ్యం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇఫ్పుడు ఆప్ఘన్ గడ్డపై చాలా కాలం తర్వాత ఇంత భారీ సంఖ్యలో జనాన్ని బలిగొంది. దీంతో ఈ దాడులకు పరోక్ష కారణంగానూ కనిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ప్రపంచం టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. తాజాగా మీడియా సమావేశంలోనూ బైడెన్ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలొంచి ఉద్వేగంతో ఉండిపోయారంటే ఈ ఘటన అమెరికాను సైతం ఎంతగా ప్రభావితం చేస్తోందో అర్దం చేసుకోవచ్చు.

 తాలిబన్లతో ట్రంప్ ఒప్పందం

తాలిబన్లతో ట్రంప్ ఒప్పందం

ఆప్ఘనిస్తాన్ గడ్డపై ఉన్న అమెరికన్లను వదిలిపెట్టి మీరు ఎవరినైనా చంపుకోండి, మేం కూడా మీ జోలికి రాబోమంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్లతో గతంలో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం అమల్లో ఉండటంతో గత ఏడాది కాలంలో ఆప్ఘన్ గడ్డపై అమెరికన్లపై దాడులకు పాల్పడటాన్ని తాలిబన్లు విరమించుకున్నారు. మిగతా దేశాల సైనికుల్ని, ఆప్ఘన్ పౌరుల్ని లక్ష్యంగా చేసుకని మాత్రమే దాడులు చేసేవారు. ఈ ఒప్పందం వల్లే ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని తాలిబన్లు సులువుగా కుప్పకూల్చి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలిగారు. దీంతో ఇప్పుడు బాంబుదాడుల నేపథ్యంలోనూ అదే ఒప్పందం తెరపైకి వస్తోంది.

 తాలిబన్లకు అమెరికా లిస్ట్

తాలిబన్లకు అమెరికా లిస్ట్

అమెరికాలో ట్రంప్ ప్రభుత్పం స్ధానంలో బైడెన్ సర్కార్ వచ్చాక తాలిబన్లతో సహకారం కొనసాగించింది. అదే క్రమంలో ఆప్ఘన్ గడ్డపై ఎవరెవరిని చంపకూడదన్న దానిపై వీరిద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అమెరికా సైనికులతో పాటు ఆప్ఘన్ పౌరుల్లో కొందరిని చంపకుండా వారి పేర్లను అమెరికా తాలిబన్లకు ఇచ్చింది. ఈ లిస్ట్ లో ఉన్న వారిని మాత్రం ఎట్టి పరిస్దితుల్లోనూ చంపొద్దంటూ తాలిబన్లకు అమెరికా షరతు పెట్టింది. ఇన్నాళ్లూ ఈ ఒప్పందాన్ని గౌరవించి సహనంగా ఉన్న తాలిబన్లు.. ఎప్పుడైతే ఆగస్టు 31 తర్వాత కూడా అమెరికన్లు ఆప్ఘన్ లో ఉంటారని బైడెన్ ప్రకటించారో అప్పుడే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాలని నిర్ణియంచారు. దీంతో తాలిబన్లకు మద్దతుగా ఉన్న ఐసిస్ సాయంతో అమెరికన్లు తిష్టవేసిన కాబూల్ ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ వ్యవహారం ఇప్పుడు బైడెన్ కు తీవ్ర తలనొప్పిగా మారిపోయింది.

Recommended Video

    Joe Biden స్థానాన్ని Kamala Harris భర్తీ చేయనున్నారా ? || Oneindia Telugu
     మద్దాలి శివారెడ్డిలా దొరికిపోయిన బైడెన్

    మద్దాలి శివారెడ్డిలా దొరికిపోయిన బైడెన్

    ఆప్ఘనిస్తాన్ గడ్డపై ఉన్న వారిలో వీరిని మాత్రం చంపొద్దంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎప్పుడైతే తాలిబన్లకు లిస్ట్ ఇచ్చారో అప్పుడే వారికి యూఎస్ ప్రాధాన్యతలు తెలిసిపోయాయి. ఎవరిని టార్గెట్ చేస్తే బైడెన్ ఇరుకునపడతారో కూడా అర్ధమైంది. దీంతో ఆగస్టు 31 డెడ్ లైన్ తర్వాత కూడా తమ సైనికులు అక్కడే ఉంటారని బైడెన్ ప్రకటన చేయగానే తాలిబన్లకు ఎక్కడో కాలింది. దాని ఫలితమే కాబూల్ ఎయిర్ పోర్టులో ఈ జంట పేలుళ్లు. రేసుగుర్రం సినిమాలోలా ప్రత్యర్ధులకు తమ జాబితా ఇచ్చి మద్దాలి శివారెడ్డి ఎలా దొరికిపోయాడో, అలాగే ఇక్కడ బైడెన్ కూడా అమెరికన్లు, ఆఫ్ఘన్లతో కూడిన తమ జాబితా ఇచ్చి దొరికిపోయారు. దీంతో తాలిబన్ల పని సులువైంది. చివరికి మద్దాలి శివారెడ్డి లాగే బైడెన్ కూడా ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+