రష్యాతో కటిఫ్ చేసుకుంటేనే చర్చలు ప్రారంభిస్తాం: అమెరికా సంచలనం
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ లు అమలవుతూ వస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేస్తే తాము చర్చల్లో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికా- భారత్ సంబంధాలపై భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయని.. ఇరు వర్గాలు సంతృప్తికరంగానే ఉన్నట్లు తెలిపారు. అమెరికా- భారత్ మధ్య తొలి విడత ఒప్పందం ఈనెల చివరి నాటికి ఖరారు అవుతుందన్నారు. మరోవైపు రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు స్పష్టం అవుతోంది.
ఇదిలా ఉంటే ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ఏమాత్రం లెక్క చేయకుండా దాడులను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని భావించిన ట్రంప్.. రష్యా మిత్ర దేశాలపై టారిఫ్ లు పెంచేశారు. ఈ క్రమంలో రష్యా నుంచి అధిక మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. భారత్ వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు ప్రాక్టికల్ గా సాధ్యం కావని పుతిన్ చెబుతున్నారు. కీలకమైన సమస్యలపై ఉక్రెయిన్ తో ఏకీభవించలేమని.. టెక్నికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిపారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఆర్మీ చట్టం అమల్లో ఉంది.. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు సరిహద్దు దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు వీలు లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications