రాహుల్ తో కుమ్మక్కు, మోడీ, అదానీపై దాడి..! బీజేపీకి అమెరికా స్ట్రాంగ్ కౌంటర్..!
కొన్నేళ్లుగా భారత్ లో ప్రధాని మోడీ, బిలియనీర్ గౌతం అదానీకి వ్యతిరేకంగా విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మీడియా పోర్టల్ ఓసీసీఆర్పీకి అండగా నిలుస్తున్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం ఖండించింది. భారత్ లో ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలకు అమెరికా మద్దతునిస్తోందంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై అమెరికా ఎంబసీ ఘాటుగా స్పందించింది. బీజేపీ ఆరోపణలు తమను తీవ్రంగా నిరాశపర్చినట్లు ఎంబసీ పేర్కొంది.
భారత్ ఇమేజ్ దెబ్బతీసేందుకు తమ దేశంలోని ఓసీసీఆర్పీతో పాటు ఇక్కడి విపక్ష నేత రాహుల్ గాంధీతో అమెరికా ప్రభుత్వం కుమ్మక్కైందంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై ఎంబసీ అధికార ప్రతినిధి స్పందించారు. ఓసీసీఆర్పీ నివేదికల్ని పట్టుకుని రాహుల్ గాంధీ ఇక్కడి ఎన్డీయే ప్రభుత్వాన్ని, అదానీని టార్గెట్ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. మీడియా స్వేచ్ఛ ఇవ్వడంలో తమ దేశం ఛాంపియన్ అని అమెరికా పేర్కొంది.

స్వతంత్ర జర్నలిస్టులకు వృత్తి పరమైన ప్రోత్సాహం, సామర్ధ్యాల పెంపు కోసం పనిచేసే సంస్థలకు అమెరికా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, అయితే ఈ మద్దతు వారి ఎడిటోరియల్ నిర్ణయాల్లో జోక్యానికి కాదని, వారిపై తమ ప్రభావం ఏమీ ఉండబోదని తెలిపింది. ఆమెస్టర్ డ్యామ్ కు చెందిన ఓసీసీఆర్పీ సంస్థ నేరాలు, అవినీతిపై ఫోకస్ పెడుతుందని తెలిపింది.
తాజాగా ఫ్రెంచ్ మీడియాలో అమెరికా ఓసీసీఆర్పీకి నిధులు ఇస్తోందని, అలాగే జార్జ్ సోరోస్, రాక్ ఫెల్లర్ వంటి మోడీని టార్గెట్ చేసే వ్యక్తులు, సంస్థల్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు తాము మద్దతిస్తామని, ప్రజాస్వామ్యానికి ఇదెంతో అవసరమని తెలిపింది.












Click it and Unblock the Notifications