హల్దీరాంకు అమెరికా షాక్, మ్యాగీపై నెస్లే కొత్త వాదన
న్యూఢిల్లీ/వాషింగ్టన్: మ్యాగీ నూడుల్స్ వివాదం పూర్తిగా సమసిపోకముందే నాగపూర్ కేంద్రంగా పని చేస్తున్న హల్దీరాం ఉత్పత్తులు అమెరికాలో అమ్మకాలకు యోగ్యంగా లేవని అక్కడి ఆహార భద్రత తనిఖీదారులు ముద్ర వేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
అధిక స్థాయిలో పురుగు మందులు, బ్యాక్టీరియా, బూజు వంటివి వాటిలో ఉన్నట్లు గుర్తించామని అమెరికా ఆహారశాఖ వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ ఏడాది భారత్ నుంచి దిగుమతి చేసుకున్నవాటిలో తిరస్కరణకు గురైన ఎక్కువ ఉత్పత్తులు హల్దీరాం సంస్థవేనని పేర్కొంది.
వీటిలో కల్తీ పదార్థాలు, విషపూరితాలు ఉన్నాయని పేర్కొంది. బ్రిటానియా సంస్థకు చెందిన కొన్ని ఉత్పత్తుల్నీ అమెరికా తిరస్కరించింది. మరోవైపు, తమ ఆహార ఉత్పత్తులు పూర్తి సురక్షితమంటూ హల్దీరాం సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో అనుమతించే పురుగు మందును అమెరికాలో అనుమతించకపోవచ్చని తెలిపింది.

నెస్లే కొత్త వాదన
మ్యాగీ వివాదంలో నెస్లే సరికొత్త వాదనకు తెరలేపింది. జనవరిలో అమెరికా ఫుడ్ రెగ్యులేటర్ దిగుమతికి అనుమతించని మ్యాగీ ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయినవి కాదని, అవి నకిలీ ప్యాకెట్లను నెస్లే ప్రతినిధి వివరించారు.
అమెరికా ఎఫ్‌డీఏ వెబ్ సైట్ నుంచి తాము సమాచారాన్ని సేకరించామని, అవి భారత్‌లో తమచేత తయారైన ఉత్పత్తులు కాదని, కానీ వాటి పైన తమ సంస్థకు చెందిన లేబుల్స్ ఉన్నాయని పేర్కొంది. దీనిని బట్టి అవి నకిలీలని తెలుస్తోందని చెప్పింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications